English | Telugu

నిఖిల్ తప్పుల్ని లేపేసిన బిగ్ బాస్ ఎడిటర్.. సోనియా చేసిన చిల్లర పని అదే!





అసలు బిగ్ బాస్ హౌస్ లో లైవ్ టాస్క్ లలో ఏం జరుగుతుంది. బిగ్ బాస్ ఎడిటర్ మావ ఏం చూపిస్తున్నాడో ఓసారి చూద్దాం.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఆపడం కోసం ఇరు టీమ్ లకి మధ్య టాస్క్ లు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్నటి ఎపిసోడ్ లో .. నిఖిల్ టీమ్ నుండి పృథ్వీ, సీత టీమ్ నుండి నబీల్ వచ్చారు. ఇక బాల్ ని పగలకుండా ఇద్దరు రెండు చేతులతో పట్టుకొని ఉన్నారు. అయితే బిగ్ బాస్ పదిహేను నిమిషాలు అలా ఉంటే సరిపోతుందని చెప్పాడు కానీ దాదాపు 2:30 గంటల సేపు వాళ్ళిద్దరు పట్టుకొని నిల్చున్నారు.‌ ఇకీ గేమ్ తర్వాత బిగ్ బాస్ నబీల్ ని అభినందించాడు. మహాతాలి టాస్క్ ముగిసిన వెంటనే ఈ టాస్క్ ఒక పెట్టాడు బిగ్ బాస్. ఇక అప్పటికే ఫుల్ గా తిన్న నబీల్ అసలు కాస్త కూడ ఆడలేని సిచువేషన్ లో ఉన్నాడు. కానీ కాంతారా టీమ్ ని గెలిపించడానికి ముందుకొచ్చాడు నబీల్. గేమ్ స్పిరిట్, టీమ్ స్పిరిట్ అంటే ఇదే అని నబీల్ ఆటతీరు చెప్తుంది. ఇక ఇద్దరు రెండు చేతులతో కాదు ఒక్క చేతితో పట్టుకోవాలని బిగ్ బాస్ మళ్ళీ మార్చేశాడు. అయినప్పటికి‌ పృథ్వీకి నబీల్ టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇక కాసేపటికి నబీల్ చేతి నొప్పి భరించలేక వచ్చేశాడు. పృథ్వీ గెలిచాడు. శక్తి టీమ్ ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపింది. ఇదంతా ఎడిటర్ మావ లేపేశాడు.‌ఇక ఆ తర్వాత నబీల్ దగ్గరికి నిఖిల్ వెళ్ళి సూపర్ రా అంటు అభినందిస్తాడు. కాసేపు నబీల్ దగ్గరే ఉండి అతనికి మసాజ్ కూడా చేస్తాడు. హౌస్ అంతా నబీల్ ఎఫర్ట్స్ ని గుర్తించి అభినందిస్తారు. అది లేపేశాడు‌ ఎడిటర్ మావ.

నిఖిల్, సీత ఇద్దరు కలిసి.. టీమ్ ల వారిగా కాదు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపాలని చెప్పి కలిసి ఆడాలని అనుకుంటారు. ఇది ఎడిటర్ మావ లేపేశాడు. ఇక సీతతో నిఖిల్ మాట్లాడి వెళ్ళి.. సోనియా చెప్పగానే దానికి ఒకే అని నబీల్ తీసేద్దామని అనుకుంటారు. బిగ్ బాస్ ఎడిటర్ మావ ఇది లేపేశాడు. ఇలా శక్తి టీమ్ లోని సోనియా, నిఖిల్ భాగోతాన్ని మొత్తం దాచేసి... మోస్ట్ వాల్యుబుల్ ఎపిసోడ్ ని కాస్తా పాటలు, డ్యాన్స్ లతో సప్పగా చేశారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.