English | Telugu

బిందు కోసం హీరో ట్వీట్‌.. ఏం జ‌రుగుతోంది?

బిగ్‌బాస్ బిందు సీక్రెట్ ల‌వ్ ట్రాక్?

అనీష్ కురువిల్ల తొలి సారి డైరెక్ట్ చేసిన చిత్రం `ఆవ‌కాయ్‌ బిర్యానీ`. ఈ చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన బిందు మాధ‌వి ఆ త‌రువాత త‌మిళ చిత్ర‌సీమ‌కే ప‌రిమిత‌మైపోయింది. తెలుగులో కంటే త‌మిళంలోనే ఎక్కువ‌గా పేరు తెచ్చుకుంది. అయితే బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీతో మ‌ళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో బిందు మాధ‌వి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఓటీటీ బిగ్ బాస్ లో త‌న‌దైన మార్కుని ప్ర‌ద‌ర్శిస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. త‌న‌ని టార్గెట్ చేసిన అఖిల్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటోంది.

`ఆవ‌కాయ్ బిర్యానీ` త‌రువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో న‌టించినా పెద్ద‌గా ఫిలితం లేక‌పోవ‌డంతో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `పిల్ల జ‌మీందార్‌` త‌రువాత నుంచి తెలుగులో క‌నిపించ‌కుండా పోయింది. ఇక్క‌డ అవ‌కాశాలు రాక‌పోవ‌డం.. త‌మిళ ఇండ‌స్ట్రీ నుంచి అవ‌కాశాలు రావ‌డంతో అక్క‌డికే మ‌కాం మార్చేసింది. గ‌త కొంత కాలంగా త‌మిళ చిత్రాల్లో మెరుస్తున్న బిందు మాధ‌వి స‌డ‌న్ గా ఓటీటీ బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

లేడీ అర్జున్ రెడ్డిలా హ‌ల్ చ‌ల్ చేస్తూ సింగిల్ గానే అఖిల్ గ్రూప్ ని చెడుగుడు ఆడేస్తోంది. దీంతో సోష‌ల్ మీడియాలో బిందు మాధ‌వికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మొద‌లైంది. దీంతో అనూహ్యంగా టైటిల్ హాట్ ఫేవ‌రేట్ గా మారిపోయింది. ఇటీవ‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా అఖిల్ తో జ‌రిగిన ర‌భ‌స లో ఏకంగా అరేయ్ అఖిల్ గా .. చెప్పురా.. అంటూ షాకిచ్చింది. బిందు దెబ్బ‌ కి త‌ట్టుకోలేక అఖిల్ అబ్బా అనేశాడు. ఇదిలా వుంటే బిందు మాధ‌వి ఓ త‌మిళ హీరోతో సీక్రెట్ ప్రేమాయ‌ణం న‌డుపుతోందంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఇందుకు కార‌ణం బిందు మాధ‌వికి స‌పోర్ట్ చేస్తూ త‌మిళ హీరో, జెర్సీ ఫేమ్ హ‌రీష్ క‌ల్యాణ్
ప్ర‌త్యేకంగా ట్వీట్ చేయ‌డ‌మే. గ‌తంలోనూ వీరిద్ద‌రు రిలేష‌న్ లో వున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజా ట్వీట్ తో అది మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. మ‌రి ఈ ట్వీట్ గురించి బిందు ఏమంటుందో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.