English | Telugu

బిగ్‌బాస్ 6 లిస్ట్ ఫైన‌ల్ అయిన‌ట్టేనా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ‌త ఏడాది డిసెంబ‌ర్ 19న ముగిసింది. ఈ సీజ‌న్ విజేత‌గా వీజే స‌న్నీ టైటిల్‌ని సొంతం చేసుకుని విజేత‌గా నిలిచాడు. ఫైన‌ల్ లో యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ టైటిల్ ఫేవ‌రేట్ అంటూ ముందు నుంచి ప్ర‌చారం జరిగినా హౌస్ లో ష‌ణ్ముఖ్ - సిరి హ‌న్మంత్ ల మ‌ధ్య సాగిన ఓవ‌ర్ డోస్ రొమాన్స్ కార‌ణంగా ష‌ణ్ముక్ ఒక్క‌సారిగా విన్న‌ర్ స్థానం నుంచి ర‌న్న‌ర్ స్థానానికి జారిపోయాడు. నెటిజ‌న్ ల‌కు ష‌ణ్ముఖ్ - సిరి హ‌న్మంత్ ల రోమాన్స్ వెగ‌టు పుట్ట‌డంతో ఇద్ద‌రిని నెట్టింట ట్రోల్ చేశారు.

ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసిందే. దీని కార‌ణంగానే ష‌ణ్ముక్ - దీప్తి సునయ‌న‌ల మ‌ధ్య దూరం పెరిగింది. ఫైన‌ల్ గా ఇద్ద‌రు బ్రేక‌ప్ చెప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇదిలా వుంటే ఇటీవ‌లే ఓటీటీ వెర్ష‌న్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ని ప్రారంభించారు. ఫైన‌ల్ లో అఖిల్ కు షాకిచ్చి లేడీ కంటెస్టెంట్ బిందు మాధ‌వి విజేత‌గా నిలిచింది. ఓటీటీ వెర్ష‌న్ కూడా ముగియ‌డంతో తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 6 కు స్టార్ మా వ‌ర్గాలు స‌న్నాహాలు చేస్తున్నాయి. ఇటీవ‌లే దీనికి సంబంధించిన తాజా ప్రోమోని విడుద‌ల చేశారు.

నాగార్జున పై షూట్ చేసిన ఈ ప్రోమోలో సామాన్యుల‌కు సీజ‌న్ 6లో అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని, ఈ గోల్డెన్ ఛాన్స్ ని వినియోగించుకోండి అంటూ సామాన్యుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఇదిలా వుంటే సీజ‌న్ 6 కు సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైన‌ల్ అయిందంటూ కొంత మంది పేర్లు తాజాగా తెర‌పైకొచ్చాయి. మొత్తం 16 మంది పేర్లు ఇప్ప‌డు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. `న్యూలీ మ్యారీడ్ ఫేమ్` సంజ‌నా చౌద‌రి, హీరోయిన్ ఆశా షైనీ, యూట్యూబ‌ర్ కుషిత క‌ల్ల‌పు, యాంక‌ర్ మంజుష‌, సింగ‌ర్ మోహ‌న్ భోగ‌రాజు, జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష‌, యాంక‌ర్‌ మంజూష (సుమ‌న్ టీవి), పొప్పి మాస్ట‌ర్ (కొరియోగ్రాఫ‌ర్‌), సీరియ‌ల్ న‌టి క‌రుణ‌, యాంక‌ర్ రోష‌న్‌, ల‌క్ష్య చ‌ద‌ల‌వాడ‌, కౌశిక్ (టీవి న‌డుడు), శ్రీ‌హాన్‌, చైత‌న్య గ‌రిక‌పాటి ల పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.