English | Telugu
బిగ్ బాస్ హౌజ్ లో రతిక టార్గెట్.. ఇమ్యూనిటి టాస్క్ లో విజేత ఎవరు?
Updated : Sep 9, 2023
తెలుగు టీవీ కార్యక్రమాల్లో బిగ్ బాస్ షోకి ఉండే క్రేజే వేరు. కాగా భారీ అంచనాల మధ్య మొదలైన బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టా తో ప్రేక్షకులను అలరిస్తుంది. కాగా ప్రతీ రోజు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది. ప్రతీ సీజన్ లో జరిగే టాస్క్ లు కాకుండా ఈ సారి సరికొత్తగా టాస్క్ లు ఇస్తూ కంటెస్టెంట్స్ తో ఉల్టా పల్టాగా ఆడిస్తున్నాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ సీజన్-7 లో మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో యాక్టివ్ గా ఉందెవరంటే రతిక అని చెప్తారంత. ఎందుకంటే తను ఒక యునిక్ గేమ్ ని ఆడుతూ మెచురిటి మాటలతో అందరికి గట్టి కాంపెటీషన్ ఇస్తుంది. అయితే ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనిపిస్తారో వారినే హౌజ్ లోని మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్ చేస్తారు. నిన్నటి శుక్రవారం ఎపిసోడ్ లో అదే జరిగింది. బిగ్ బాస్ ని తమ నటనతో ఇంప్రెస్ చేసిన కంటెస్టెంట్స్ ఆట సందీప్, యాక్టర్ శివాజీ, ప్రియాంక జైన్, రతికరోజ్ . ఈ నలుగురిలో నుండి ఏ ఇద్దరు ఇమ్యూనిటి బూస్టర్ ని పొందడానికి అనర్హులని భావిస్తారో వారి ముందున్న ఖాళీ గాజు బీకరులో బకెట్ తో ఇసుకని పోయాలని బిగ్ బాస్ హౌజ్ లోని వాళ్ళకి చెప్పగా.. మొదట శుభశ్రీ వచ్చి.. రతిక స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి అనర్హత ఉందని తనకి రేస్ నుండి తప్పుకోవాలని ఓట్ వేసింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ వచ్చి.. ప్రియాంక జైన్ తనని తప్పుగా అర్థం చేసుకుందని తనకి ఓట్ వేసి రేస్ నుండి తప్పుకోవాలని ఓట్ వేశాడు. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ వచ్చి తన ఓట్ ఆట సందీప్ కి వేశాడు.
ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేషన్లో ఉన్నా ఆడియన్స్ అతడిని సేవ్ చేస్తారని ఆట సందీప్ తో ప్రిన్స్ యావర్ చెప్పి తన ఓట్ ని వస్తాడు. ఆ తర్వాత దామిణి వచ్చి రతిక రేస్ నుండి తప్పుకోవాలని ఓట్ వేస్తుంది. కాసేపటికి శోభా శెట్టి వచ్చి యాక్టర్ శివాజీ అనర్హుడని రేస్ నుండి తప్పుకోవాలని ఓట్ వేస్తుంది. టేస్టీ తేజ వచ్చి రతిక అనర్హత ఉందని ఓట్ చేస్తాడు. ఇలా కంటెస్టెంట్స్ అంతా తమ ఓటింగ్ పూర్తయిందని చెప్పారు. ఓటింగ్ చూసాక రతిక, యాక్టర్ శివాజీ ఇమ్యూనిటి టాస్క్ రేస్ నుండి తప్పుకుంటున్నారని చెప్పాడు బిగ్ బాస్. కాగా ఇమ్యూనిటి టాస్క్ తర్వాతి రౌండ్ లో ప్రియాంక జైన్, ఆట అందీప్ లకి మరొక టాస్క్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో రతికకి ఎక్కువ ఓట్లు పడ్డాయి, కారణమేంటంటే రతికని బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాకి పిలిచి ఒక టాస్క్ ఇచ్చాడని, ఆ టాస్క్ ఏంటో తమకి తెలియదని, రతికని అడిగిన చెప్పకపోవడంతో తనేదో సీక్రెట్ టాస్క్ ఆడుతుందేమోనని మిగిలిన కంటెస్టెంట్స్ భావించి. తనని బిగ్ బాస్ నుండి పంపించెయ్యడానికే ఇమ్యూనిటి టాస్క్ లో ఓడిపోవాలని అందరు రతికకే ఓట్లు వేశారు. కాగా మిగిలిన ఇద్దరిలో ఎవరు ఈ టాస్క్ గెలుస్తారో చూడాలి మరి!