English | Telugu
మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక!
Updated : Sep 7, 2021
అవకాశం దొరికితే చాలు... రష్మీ గౌతమ్ మీద తనకున్న ప్రేమను చాటుకోవడానికి 'సుడిగాలి సుధీర్ ఏమాత్రం వెనుకాడడు. ప్రతిసారీ రష్మీకి అతడే ప్రపోజ్ చేస్తుంటాడు. బట్, ఫర్ ఏ చేంజ్... ఈసారి సుధీర్‌కి రష్మీ గౌతమ్ ప్రపోజ్ చేసింది. అయితే, అదీ ఈవెంట్‌లో చేసిన ఓ పర్ఫార్మెన్స్‌లో భాగంగా ప్రపోజ్ చేసింది. అయితే... రోజా మాత్రం అడిగేశారు. 'మీ ఇద్దరి పెళ్ళెప్పుడు?' అని! ఎప్పటిలా రష్మీ ముసిముసి నవ్వులు నవ్వి సరిపెడుతుందో? లేదంటే ఏమైనా సమాధానం చెప్పిందో? గణేష్ చతుర్థి స్పెషల్ ఈవెంట్ 'ఊరిలో వినాయకుడు'లో చూడాలి.
వినాయక చవితి సందర్భంగా మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ ఈటీవీ కోసం 'ఊరిలో వినాయకుడు' పేరుతో ఓ ఈవెంట్ చేసింది. శుక్రవారం అది టెలికాస్ట్ కానుంది. అందులో 'తొమ్మిది సంవత్సరాల తీపి గుర్తులను తొమ్మిది గిఫ్టులుగా నీకు గుర్తుండిపోయేలా ఇస్తున్నా' అంటూ సుధీర్ ను సోఫాలో కూర్చోబెట్టి రష్మీ గౌతమ్ ఒక డాన్స్ పెర్ఫార్మన్స్ చేసింది. దాన్ని బాగా డిజైన్ చేసినట్టు ఉన్నారు.
పెర్ఫార్మన్స్ చివర్లో సుధీర్ వైపు లవ్ సింబల్ చూపించింది రష్మీ. ముద్దులు కూడా ఇచ్చింది. ఆ తర్వాత 'తొమ్మిదేళ్లు వెయిట్ చేసినందుకు ఎంత అందంగా ప్రపోజ్ చేసిందంటే... మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక' అని రోజా చెప్పారు. 'ఫైనల్ గా మీరేం చెబుతారు?' అని ఇంద్రజ కూడా అడిగారు. సుధీర్, రష్మీ ఏం చెప్పారో మరి? రష్మీ ఎమోషనల్ అయినట్టు చూపించారు. ఎందుకో ఈవెంట్ చూస్తే తెలుస్తుంది.