English | Telugu
రోహిణితో గొడవ... 'క్యాష్' నుండి వర్ష వాకౌట్!
Updated : Sep 8, 2021
'జబర్దస్త్'తో రోహిణి, వర్షకు పాపులారిటీ పెరిగింది. రాకింగ్ రాకేష్ స్కిట్స్, హైపర్ ఆది స్కిట్స్ లో రోహిణి చేస్తోంది. మొన్నటివరకు కెవ్వు కార్తీక్ స్కిట్స్ లో చేసిన వర్ష, ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ లో చేస్తోంది. 'ఊరిలో వినాయకుడు' ఈవెంట్ కోసం వర్ష ఇంట్లో చేసిన పూజకు రోహిణి వెళ్ళింది. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బలపడిందని భావిస్తున్న సమయంలో, గొడవలు బయటపడ్డాయి.
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'క్యాష్' షోకి రోహిణి, వర్ష వచ్చారు. తనను 'బండ... బండ' అని వర్ష పిలవడంతో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇంకోసారి బండ అన్నావంటే ఎత్తి అలా వేసేస్తాను' అని రోహిణి సీరియస్ అయ్యింది.
''అసలు ఈ అమ్మాయి ఉంటే నేను షోకి రాకూడదని అనుకున్నాను. మాట్లాడితే నా పర్సనాలిటీ మీద... నువ్వు సన్నగా ఉంటావు. అది నీ బాడీ తత్వం. నన్ను అనకు'' అని వర్ష ముఖం మీద రోహిణి ఫైర్ అయ్యింది. దాంతో షో నుండి వర్ష వాకౌట్ చేసింది. 'రోహిణి ఉంటే నేను షోకు రానండి' అని వర్ష వెళ్ళిపోయింది. 'నీ ముందు నిలబడాలంటే నాకు చిరాకు' అని రోహిణి అన్నది. వీళ్లిద్దరి ప్రవర్తన చూసి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సుమ సైతం అసహనం వ్యక్తం చేసింది.
వర్ష, రోహిణి గొడవ ప్రాంక్ లో భాగమా? లేదంటే నిజమా? అనేది షో టెలికాస్ట్ అయితే గానీ తెలియదు. టీఆర్పీ కోసం ఈమధ్య ఇటువంటివి చేస్తున్నారు. 'జబర్దస్త్'లో వెంకీ మంకీస్ టీమ్ లీడర్ వెంకీ అందరితో తాను స్కిట్స్ చేయిస్తుంటే తనకు పేరు రావడం లేదని వాపోయాడు. దాన్ని ప్రోమోలో హైలైట్ చేశారు. షో చూస్తే... ప్రాంక్ అన్నారు. వర్ష, రోహిణి గొడవ నిజమా? కాదా? అన్నది త్వరలో తెలుస్తుంది.