English | Telugu

రాజ్ ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా తీసుకొచ్చేదేంటని కావ్య డౌట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -130 లో.. అప్పు షాపింగ్ ఉందని మియాపూర్ వెళ్లాలని కళ్యాణ్ తో అప్పు అంటుంది. సరేనని బైక్ మీద అప్పుని తీసుకొని వెళ్తాడు కళ్యాణ్. మరోవైపు కనకంతో మాట్లాడుతూ మీనాక్షి టెన్షన్ పడుతుంటుంది. మీ ఇల్లు కంటే నరకమే మేలని కనకంతో మీనాక్షి అంటుంది. ఈ పేదరికం వల్ల నా మనసెప్పుడో రాయిలా మారింది అక్క అని కనకం అంటుంది.  ఆ తర్వాత కృష్ణమూర్తి దగ్గరికి మీనాక్షి వెళ్ళి.. మీకు స్టోర్ రూంలో ఏం పని లేదు కదా అని అడుగుతుంది. నాకేం పనిలేదు.. మీకు పనిలేదా అని కృష్ణమూర్తి అంటాడు. మీకు స్టోర్ రూంలో పని ఉంటే నాకు చెప్పండని కృష్ణమూర్తితో మీనాక్షి చెప్పి వెళ్ళి హాల్లో కూర్చుంటుంది.

ఇది కాకపోయి ఉంటే టీచర్ ని అయ్యేదాన్ని

బుల్లితెర మీద "కార్తీక దీపం" సీరియల్ లో హిమ రోల్ లో  అమాయకపు అమ్మాయి పాత్రలో నటించింది కీర్తి భట్. ఇప్పుడు "మధురానగరిలో" అనే సీరియల్ లో నటిస్తోంది. కీర్తి భట్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కి ఆమె గురించి బాగా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 6  లో ఆమె తన గురించి మొత్తం చెప్పేసింది. తన జీవితంలో వున్న విషాదాన్ని పంచుకోవడంతో ఆడియన్స్ కి ఆమె ఇంకా బాగా దగ్గరయ్యింది. కీర్తిభట్ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు పిల్లలంటే చాల ఇష్టం కూడా. అలా తన ఫోటో షూట్స్ తో పాటు తన సీరియల్ లో నటించే పిల్లాడితో ఎన్నో ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

గీతికని సపోర్ట్ అడిగిన ముకుంద.. రేవతి కొత్త ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -190 లో.. ముకుంద ఫ్రెండ్ గీతిక ఇంటికి వస్తుంది. గీతికను కృష్ణ చూసి ఎలా ఉన్నావని అడుగుతుంది. ఎలాగైనా ఏసీపీ సర్ డైరీ లో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని కృష్ణ అనుకుంటుంది. నిన్నోకటి అడగాలి గీతికా? చెప్తావా అని కృష్ణ అడుగుతుంది. అడుగు కృష్ణ చెప్తానని గీతిక అనగా.. ఏసీపీ సర్ నీకు ఎప్పటి నుండి తెలుసని కృష్ణ అడుగుతుంది. ఆమ్మో ఇప్పుడు నిజం చెప్తే సిచుయేషన్ ఎలా ఉంటుందోనని అనుకున్న గీతిక.. అబద్దం చెప్పడం బెటర్ అని ముకుంద-ఆదర్శల పెళ్లి అప్పటి నుండి తెలుసని గీతికా అంటుంది. గీతిక ఏదో దాస్తున్నట్లు కృష్ణకి అనిపిస్తుంది. ఆ తర్వాత ముకుంద గదిలోకి గీతిక వెళ్తుంది.

 నీది మంచి మనసు అంటున్న నెటిజన్

ఫైమా గురించి బుల్లితెర మీద తెలియని వారంటూ ఎవరూ లేరు. ఎంతో కష్టపడి ఒక్కో అడుగు వేసుకుంటూ ఎదుగుతూ వస్తోంది. ఆమె కామెడీ టైమింగ్ కి పంచులకు చాలామంది మాస్ ఫాన్స్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా...ఎవరేమన్నా లైట్ తీసుకుంటూ కామెడీ పండించింది. అలాంటి ఫైమా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఫైమా వాళ్ళ అమ్మ ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. బయట గుమ్మంలో చీపురుతో ఊడ్చుకుంటూ ఉండగా ఆమెకు సడెన్గా తల భారంగా అనిపించి తల పెట్టుకొనేసరికి  ఇంతలో ఇంటి లోపల నుంచి వచ్చిన ఫైమా.. వాళ్ళ అమ్మ బాధను గమనించి వెంటనే ఆ పక్కనే ఉన్న అరుగు మీద కూర్చోబెట్టింది.. అలా మొత్తం గుమ్మమంతా ఊడ్చేసి బట్టలు ఉతికి ఆరేసి...వంట చేసి కలిపి ముద్దలు తినిపించింది. దానికి వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది.

అప్పుని అవమానించినందుకు రుద్రాణిపై దుగ్గిరాల ఫ్యామిలీ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసరవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -129 లో... కనకం, మీనాక్షి కలిసి సేటుని రూమ్ లో బంధిస్తారు. ఆ తర్వాత టెన్షన్ పడుతారు. అంతలోనే కృష్ణమూర్తి వస్తాడు. కనకం.. తడబడుతూ మాట్లాడుతుంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని కృష్ణమూర్తి అడుగుతాడు. దాంతో పక్కనే ఉన్న మీనాక్షి కవర్ చేస్తుంది. అంతలోనే అప్పు వస్తుంది. ఈ మామిడి కాయలు తీసుకెళ్లి స్వప్నకి ఇచ్చి రా ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు పుల్లటివి తినాలనిపిస్తుంది కదా అని అప్పుతో కృష్ణమూర్తి  చెప్పి, స్వప్న దగ్గరికి పంపిస్తాడు.