English | Telugu

పెళ్లికాని వాళ్ళ బాధను వర్ణించిన ఆది..నీ పనికిమాలిన పనులు బయట చూస్కో అన్న శేఖర్ మాష్టర్

ఢీ సీజన్ 16 ఢీ ప్రీమియర్ లీగ్ పేరుతో రీసెంట్ గా లాంఛ్ అయ్యింది. ఈ షోకి జడ్జెస్ గా పూర్ణ, శేఖర్ మాష్టర్ వచ్చేసారు. ఇక ఓల్డ్ సీజన్ లో ఆది ఎలాంటి డైలాగ్స్ వేసేవాడో అందరికీ తెలుసు. ఐతే ఇప్పుడు లాంఛింగ్ ఎపిసోడ్ నుంచే పంచులు వేయడం మొదలు పెట్టేసాడు..రావడమే పెళ్లికొడుకు గెటప్ లో వచ్చేసరికి అందరూ షాకయ్యారు. "పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా" అనుకునేసరికి "అసలు నేను సరిగానే వింటున్నానా" అని ప్రదీప్ అనడంతో ఆది ఇంకా హిస్టరీ చెప్పడం మొదలెట్టాడు" 30 ఏళ్ళు దాటినా పెళ్లి కానీ కుర్రాళ్ళ కష్టాల గురించి మీకేం తెలుసండి... మంచం మీద అటు దొర్లినా ఇటు దొర్లినా ఎవరూ లేక ఎంత బాధపడతాడో తెలుసా". "కావాలని ఒక కల గని ఆ కలలోకి హీరోయిన్స్ ని తెచ్చుకుని కాసేపు కబుర్లు చెప్పి ముద్దు పెడదాం అనుకునేలోపు మేనేజర్ ఫోన్ చేసి వెహికల్ వచ్చింది ఎక్కువయ్యా అంటే ..ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా...నాకు తెలుసు" అన్నాడు. "వాట్సాప్ లో ఒక కొత్త నంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ రాగానే హాయ్ ..ఎం చేస్తుంటారు. ఫామిలీతో ఉంటారా సింగల్ గా ఉంటారా..అంటూ ఆత్రంగా మెసేజ్ పెట్టినప్పుడు అవతల నుంచి నేనురా సతీష్ ఇది నా న్యూ నంబర్ అని చెప్పినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా నాకు తెలుసు".

"30 ఏళ్ళు దాటిన కుర్రాడు న్యూస్ పేపర్ తీసుకుని మేడ మీద ఎందుకు వేళ్తాడో తెలుసా...ఆ పక్కింట్లోంచి బట్టలు ఆరేయడానికి వచ్చే అమ్మయినా వడియాలు పెట్టడానికి వచ్చే ఆంటీనో చదవడానికి వెళ్తారు. కానీ వాళ్ళు ఒక్క లుక్ ఇవ్వకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా...నాకు తెల్సు" అంటూ తన బాధ మొత్తం చెప్పాడు. "పెళ్లి చేసుకోవడానికి వచ్చా...చేసుకుంటా" అన్నాడు.."ఐతే ఫిక్స్ అయ్యావా..బయట అంత మంది ఉన్నారు కదా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా" అని ప్రదీప్ అడిగేసరికి "బయట పెళ్లి చూపులకు వెళ్లాలంటే ఆ ఊరు ఈ ఊరు అని పెట్రోల్ ఖర్చు ఇవన్నీ ఎవరు భరిస్తారు..ఈ షోకి అన్ని ఊళ్ళవాళ్ళు వస్తున్నారట కదా..ఇక్కడే చూసుకుందామని" అని చెప్పేసరికి "వాళ్ళు వస్తోంది డాన్స్ చేయడానికి" అన్నాడు ప్రదీప్ "వాళ్ళ డాన్సులు వాళ్ళను చేసుకోనివ్వు...మనం సెలెక్ట్ చేసుకుంటాం" అన్నాడు ఆది. "ఇక్కడ డాన్స్ మాత్రమే చూడు. నీ పనికిమాలిన పనులు ఏమైనా ఉంటే బయట చేసుకో" అన్నారు శేఖర్ మాస్టర్. "బయట ఎక్కడ చేసుకోనిస్తున్నారు..అక్కడ కూడా మీరే చేసుకుంటున్నారు కదా" అని కౌంటర్ వేసాడు ఆది. వెళ్లి సోఫాలో కూర్చోబోతుంటే అవి డాన్సర్స్ కోసం వేసినవి అని శేఖర్ మాష్టర్ అనడంతో ప్రదీప్ వెళ్లి నేల మీద క్లాత్ వేసి ఆదిని కింద కూర్చోబెట్టాడు ప్రదీప్.