English | Telugu
వైరల్ అవుతున్న సదా తీసిన వైల్డ్ లైఫ్ ఫుటేజ్!
Updated : Jun 23, 2023
సదా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది అభిమానులను కలిగి ఉన్న సదా.. ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ అందరికి దగ్గరగా ఉంటుంది. తనచుట్టూ ఎప్పుడు గ్రీనరీ ఉండేలా చూసుకుంటుంది సదా.. తన ఇంట్లో కూడా మొత్తం గ్రీన్ కలర్ వస్తువులు, గ్రీన్ సోఫాలు ఇలా తనకిష్టమైన గ్రీన్ కలర్ ని చూసుకుంటుంది. సదాకి అడవిలోకి వెళ్ళి ఫోటోగ్రఫీ తీయడం ఒక ఇష్టమైన అలవాటు. అందుకే రెగ్యులర్ గా తను తీసిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఆ ఫోటోలకి అత్యధిక వ్యూస్ కూడా వస్తున్నాయి.
సదా.. తెలుగు సీనీ పరిశ్రమలో 'జయం' మూవీతో అరంగేట్రం చేసిన సదా.. మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది. అల్లరి నరేష్ తో కలిసి 'ఊపిరి' సినిమాలో నటించింది. జయం, నాగ, లీలా మహల్ సెంటర్, దొంగ-దొంగది, ఔనన్న కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్ మేట్స్, శంకర్ దాదా జిందాబాద్, టక్కరి, అపరిచితుడు, యమలీల 2 మొదలగు సినిమాలలో నటించిన సదా.. తన సినిమా కెరీర్ లో 'జయం' మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
సదా ముంబైలో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసి అక్కడే తన జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఈ మధ్యకాలంలో ఎమోషనల్ అవుతూ ఒక వ్లాగ్ ని చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. సినిమాలలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న సదా.. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. పలు టీవీ షోస్ లో జడ్జ్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. 'ఢీ' డాన్స్ షోకి శేఖర్ మాస్టర్ తో కలిసి జడ్జ్ గా వ్యవహరించగా వీళ్ళిద్దరి జడ్జిమెంట్ అంటే ఎంటర్‌టైన్మెంట్ కి కేరాఫ్ గా ఉంటుంది. బిబి జోడికి జడ్జిగా చేసి ఆ షోకి మరింత క్రేజ్ వచ్చేలా చేసింది సదా. అయితే సదాకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. దాంతో తను తాజాగా 'మాయా వర్సెస్ రోమా' అనే ఫుటేజ్ ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ వీడియో ఫుటేజ్ చూసినవారంతా లైక్స్ తో పాటు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అందులో ఉన్న మాయా అంటే తనకి చాలా ఇష్టం అన్నట్లు ఆ పోస్ట్ కింద వివరించింది సదా. కాగా ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.