Read more!

English | Telugu

పాన్ ఇండియా షో...బెజవాడ టైగర్స్ కప్పు కొడతారన్న వరుణ్ సందేశ్

ఢీ ప్రీమియర్ లీగ్ స్టార్టింగ్ చూస్తేనే చాలు ఈ సీజన్ మొత్తం దుమ్మురేపే కొరియోగ్రాఫర్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి డాన్స్ ని చూస్తాం అనిపిస్తోంది. ఐతే ఈ వారం కేవలం నాలుగు టీమ్స్ ని మాత్రమే పరిచయం చేసాడు హోస్ట్ ప్రదీప్. అలాగే వాళ్ళ టీమ్స్ ని రిప్రెజంట్   చేయడానికి కొంతమంది సెలబ్రిటీస్ ని కూడా తీసుకొచ్చాడు. అభి మాస్టర్ టీం పేరు  బెజవాడ టైగర్స్ ..ఈ టీమ్ ని రిప్రజంట్ చేయడానికి వచ్చిన లీడర్  వరుణ్ సందేశ్. "బెజవాడ టైగర్స్ అని మేము చెప్తే వరుణ్ మాత్రం వైట్ కుర్తా వేసుకుని ప్రశాంతంగా వచ్చారు" అని ప్రదీప్ అనేసరికి "ప్రశాంతతలోనే పవర్ ఉంటుంది" అన్నారు వరుణ్. "ఒక విషయం చెప్తా విజయవాడ కనకదుర్గమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా ..మా టీమ్ తో ఎవరన్నా పోటీకి రావాలని చూస్తే కృష్ణానగర్ లో"అనేసారు...కృష్ణమ్మ అనబోయి కృష్ణా నగర్ లో అనడంతో "కృష్ణా నగర్ అని వచ్చేసింది" అంటూ శేఖర్ మాష్టర్ గట్టిగా అరిచారు. 

"నా టీమ్ ఫైనల్స్ వరకు వెళ్లి కప్పు కొట్టాలని ఆశిస్తున్నా" అన్నారు వరుణ్. "వరుణ్ వచ్చాక పాన్ ఇండియా షో అయ్యింది" అని కౌంటర్ వేసేసరికి "ఎందుకు బ్రో నన్ను" ఇరికిస్తావ్ అన్నట్టుగా వరుణ్ అనేసరికి ప్రదీప్ నవ్వేసాడు. తర్వాత గ్రీష్మ మాస్టర్ టీం ఎంట్రీ ఇచ్చింది. వీళ్ళ టీమ్ పేరు  హైదరాబాద్ ఉస్తాద్స్ .. ఈ టీమ్ ని రిప్రెజంట్ చేయడానికి విజె సన్నీ వచ్చాడు. "హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ. ఢీ 16 ల ఈసారి మావోల్లు కప్పు కొడతారు తప్పకుండా" అని చెప్పాడు...ఇంతలో ఆది వచ్చి "హైదరాబాద్ ని రిప్రెజంట్ చేయడానికి వచ్చి ఇద్దరి లేడీస్ తోనే ముందుకు నడుచుకు వచ్చావ్ ఎందుకు" అనేసరికి "అలా ముందుకు ఆడవాళ్ళతో వెళితే కలిసి వస్తుందని" అన్నాడు సన్నీ. "ఎంత మంది కలిసొచ్చారు ఇప్పటివరకు" అంటూ కౌంటర్ వేసాడు ఆది. "పెళ్ళైన వాళ్ళు అలా కూర్చోకుండా పెళ్లి కానీ నాకు , సన్నీకి, ప్రదీప్ కి ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వండి" అని అది అడగడంతో..."పెళ్లి చేసుకోండి మంచిది " అని వరుణ్ చెప్పారు "మంచి అమ్మాయి దొరికితే పెళ్లిచేసుకోండి" అని చెప్పారు శేఖర్ మాష్టర్.