English | Telugu

అన్నిటినీ వదిలేసి సరిగ్గా నెల ఐపోయింది!

నేహా చౌదరి స్టార్ స్పోర్ట్స్ యాంకర్‌గా బాగా పాపులర్. బిగ్ బాస్ సీజన్-6లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. హౌస్ లో చక్కగా ఆడింది తర్వాత ఆమె చేసిన కొన్ని పొరపాట్ల వలన హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈమె ఒక యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తోంది. అందులో తన పర్సనల్ వీడియోలతో పాటు, ఇంట్లో వేడుకలు, సరదా సరదా ముచ్చట్లు, తన హజ్బెండ్ తో కబుర్లు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. పెళ్లి కూతురు గెటప్ లోనే బిగ్ బాస్ ఫైనల్ కి వచ్చి షాక్ ఇచ్చింది. ఇప్పుడు నేహా తన భర్తతో కలిసి జర్మనీ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కూడా రకరకాల వీడియోస్ చేస్తూ పోస్ట్ చేస్తోంది నేహా. ఇప్పుడు రీసెంట్ గా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది. "నా దేశాన్ని, నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా ఫ్రెండ్స్ ని వదిలి కొత్త జీవితం మొదలు పెట్టి సరిగ్గా నెల అయ్యింది" అంటూ మంచం మీద బుంగ మూతి పెట్టుకుని ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేసుకుంది.

2019 సైమా అవార్డ్స్ ఈవెంట్ కి హోస్టుగా వ్యవహరించింది. ఆ తర్వాత స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా అవకాశం దక్కించుకుని ప్రో కబడ్డీ, ఐపీఎల్, ఐసీసీ వరల్డ్ కప్ సహా పలు ఈవెంట్స్ కి యాంకర్ గా పని చేసింది. యాక్టర్, డాన్సర్ గా మోడలింగ్ రంగంలో రాణించిన నేహా చౌదరి యోగ టీచర్ గా కూడా కొంతకాలం వర్క్ చేసింది. అలాగే కొన్ని చానెల్స్ కూడా యాంకర్ గా కనిపించింది. స్పోర్ట్స్‌ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ అమ్మడు రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. ఇక నేహా త‌న క్లాస్‌మేట్ అనిల్‌నే వివాహం చేసుకుంది. ఈమె పెళ్ళికి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంతా వచ్చి సందడి చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.