English | Telugu

 నీది మంచి మనసు అంటున్న నెటిజన్

ఫైమా గురించి బుల్లితెర మీద తెలియని వారంటూ ఎవరూ లేరు. ఎంతో కష్టపడి ఒక్కో అడుగు వేసుకుంటూ ఎదుగుతూ వస్తోంది. ఆమె కామెడీ టైమింగ్ కి పంచులకు చాలామంది మాస్ ఫాన్స్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా...ఎవరేమన్నా లైట్ తీసుకుంటూ కామెడీ పండించింది. అలాంటి ఫైమా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఫైమా వాళ్ళ అమ్మ ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. బయట గుమ్మంలో చీపురుతో ఊడ్చుకుంటూ ఉండగా ఆమెకు సడెన్గా తల భారంగా అనిపించి తల పెట్టుకొనేసరికి ఇంతలో ఇంటి లోపల నుంచి వచ్చిన ఫైమా.. వాళ్ళ అమ్మ బాధను గమనించి వెంటనే ఆ పక్కనే ఉన్న అరుగు మీద కూర్చోబెట్టింది.. అలా మొత్తం గుమ్మమంతా ఊడ్చేసి బట్టలు ఉతికి ఆరేసి...వంట చేసి కలిపి ముద్దలు తినిపించింది. దానికి వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది.

ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "లవ్ యు అమ్మ. నేను నీకోసం ఎప్పటికీ ఉంటాను" అని టాగ్ లైన్ పెట్టింది. అది చూసిన నెటిజన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు. "నువ్వు న్యూ హౌస్ కట్టించావు కదా మరి ఈ ఓల్డ్ హౌస్ లో ఎందుకు ఉంటున్నావ్" అని ఒక నెటిజన్ అడిగేసరికి "ఆ ఇంటికి రంగులు వేయించే పని జరుగుతోంది కాబట్టి ఇందులో ఉంటున్నాం ఓకే" అంటూ రిప్లై ఇచ్చింది. "జబర్దస్త్ కి రండి" అని ఒక నెటిజన్ అడిగితే "అన్నం, కూరా వండారు కానీ మీ అమ్మకి పులిహోర తినిపించారేమిటి..ఏదైతే కానీ నీకు మంచి మనసు ఉంది" అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.