English | Telugu
క్రేజీ టాక్ విత్ ఆర్జే కాజల్ లో అరియాన బోల్డ్ రిప్లై!
Updated : Jun 22, 2023
అరియాన గ్లోరీ.. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది అరియాన.. అరియాన మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియానా.
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దాంతో అరియాన ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు. అరియాన అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వల్ల అరియానాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియానా చాలా బాధపడింది.
తాజాగా ఆర్జే కాజల్ తన యూట్యూబ్ ఛానెల్ లో 'క్రేజ్ టాక్ విత్ ఆర్జే కాజల్' ని స్టార్ట్ చేసింది. అందులో కాజల్ అరియానాని కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగింది. దానికి సూటిగా సమాధనాలు చెప్పింది అరియాన. ఇందులో అరియానాతో పాటు మెహబూబ్ కూడా ఉన్నాడు. 'ఆర్జీవీ మూవీ లో ఆఫర్ వచ్చింది నిజమేనా' అని కాజల్ అడుగగా.. అవును వచ్చిందని చెప్పింది అరియాన. 'బోల్డ్ గా ఉండడం ఇష్టమా? అవసరమా' అని అడుగగా.. బోల్డ్ గా ఉండడం ఇష్టమని చెప్పింది అరియాన. ఆ తర్వాత అరియనా స్వీటా? హాటా అని మెహబూబ్ ని కాజల్ అడుగగా.. తను స్వీటే.. కానీ కొన్ని సమయాలలో ఆమె హాట్ అని మెహబూబ్ చెప్పాడు. ఇలా తన గురించి ఆసక్తికరమైన విషయాలు కాజల్ తో పంచుకుంది అరియాన.