English | Telugu
ఎంజెల్ ఇంటికి వసుధార అనుకోని ప్రయాణం.. అక్కడ తనని చూసిన రిషి షాక్!
Updated : Jun 23, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -796 లో.. రిషి ప్లేస్ ని నేను రీప్లేస్ చేస్తానని శైలేంద్ర అంటాడు. ఆ మాట విన్న జగతి.. అది అసాధ్యమని కోపంగా అంటుంది. రిషిని నువ్వే కాదు ఇంకెవరు రీప్లేస్ చెయ్యలేరు, చెయ్యరు. తన కెపాసిటి వేరే అని జగతి అంటుంది.
ఆ తర్వాత ఫణీంద్ర కూడా నువ్వు రిషి ప్లేస్ ని రీప్లేస్ చెయ్యలేవని చెప్పి వెళ్ళిపోతాడు. అందరు వెళ్ళిపోగా.. అక్కడ మహేంద్ర, జగతి మాత్రమే ఉంటారు. జగతితో మహేంద్ర మాట్లాడకపోయినా.. నేను నీతో మాట్లాడాలని చెప్పి జగతి తన మనసులో ఉన్నది మొత్తం చెప్తుంది. నేను శైలేంద్రని నిన్న కొట్టడం తప్పే కానీ నా కన్నకొడుకు గురించి అలా మాట్లాడడం.. నేను భరించలేను. నా రిషి గురించి ఎవరు ఒక్క మాట అన్నా నేను ఒప్పుకోను. నాకు రిషి అంటే ప్రాణం. ఇంకొకటి శైలేంద్ర మిషన్ ఎడ్యుకేషన్ లో ఇన్వాల్వ్ అవుతానని అంటున్నాడు కానీ ముందు తన వ్యక్తిత్వం ఏంటి అన్ని తెలుసుకొని ముందుకు వెళ్తే మంచిది. అది నేను రేపు మీటింగ్ లో చెప్పొచ్చు కానీ ఆలా చెప్తే బాగుండదని ఇప్పుడు చెప్తున్నానని జగతి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మహేంద్ర మాత్రం సైలెంట్ గా ఉంటాడు. జగతి మాట్లాడిన మాటలు దూరంగా ఉండి శైలేంద్ర వింటాడు.
పిన్ని నా గురించి బాబాయ్ కి చాడీలు చెప్తున్నావా అని అనుకుంటాడు. మరొక వైపు ఏంజెల్ షాపింగ్ కి వెళ్తుంటే.. దార్లో ఆగి ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడే ఒక దొంగ వచ్చి ఏంజెల్ ని నెట్టి తన మెడలోని గొలుసు లాక్కొని పారిపోతాడు. అలా దొంగ పారిపోవడం అటుగా వెళ్తున్న వసుధార చూస్తుంది. ఆ దొంగని కర్రతో కొట్టి, దొంగ తీసుకెళ్తన్న గొలుసుని తీసుకొని, కింద పడి ఉన్న ఏంజెల్ ని పైకి లేపుతుంది వసుధార. ఆ తర్వాత గొలుసు తనకి ఇచ్చేస్తుంది. చాలా థాంక్స్ ఈ గొలుసు నాకు సెంటిమెంట్ అని ఏంజెల్ అనగానే.. తన వేలుకి ఉన్న రింగ్ ని చూస్తూ రిషిని గుర్తుచేసుకుంటుంది. మనం ఫ్రండ్స్ అంటూ ఏంజెల్ అంటుంది. నిన్ను మీ ఇంటి వరకు డ్రాప్ చేస్తానని వసుధార అంటుంది. ఇద్దరు కలిసి కారులో ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి రాగానే ఆ ఇంటిని చూసి వసుధార.. నేను ఇంతకు ముందు ఈ ఇంటికి వచ్చానని అంటుంది. ఎప్పుడని ఏంజెల్ అనగానే.. నేను మీ కాలేజీ లో లెక్చరర్ ని అని వసుధార చెప్తుంది.
ఆ తరువాత ఇంట్లోకి వెళ్ళి ఏంజెల్ జరిగిందంత విశ్వనాథ్ కి చెప్తుంది. కానీ రిషి తనని చూస్తాడెమో అని వసుధార టెన్షన్ పడుతుంది. అంతలోనే రిషి పై నుండి కిందకి వస్తాడు. వసుధారని చూసిన రిషి షాక్ అవుతాడు. రిషి నువ్వు వెళ్లి వసుధారని డ్రాప్ చేసి రా అని ఏంజెల్ అంటుంది. నాకు వేరే వర్క్ ఉందని చెప్పి రిషి అక్కడనుండి వెళ్ళిపోతాడు. కాసేపటికి వసుధార వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎందుకు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నావ్ వసుధార అని రిషి అనుకుంటాడు. మరొక వైపు నేను గతాన్ని గుర్తు చెయ్యను.. నా ప్రేమని గుర్తించి మీరు వచ్చేంత వరకు నేను గుర్తు చెయ్యనని వసు అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.