English | Telugu
అందుకే ఆది నన్ను రావద్దంటాడు!
Updated : Jun 22, 2023
ఢీ సీజన్ 16 మంచి కలర్ ఫుల్ ఫుల్ ఎనర్జిటిక్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఎంట్రీ ఇచ్చారు టీమ్స్ . ఐశ్వర్య మాష్టర్ టీం స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చింది..ఈ టీం పేరు నెల్లూరు నెరజాణలు..వీళ్ళను కమెడియన్ సుదర్శన్ రిప్రెజంట్ చేశారు. సుదర్శన్ వచ్చేసరికి "సరే బాబు నువ్వు షూటింగ్ లో, సినిమాల్లో ఎలాగో డాన్స్ చేయవు..తప్పించుకుంటావ్..కానీ ఢీ షోకి వచ్చావు ..తప్పనిసరిగా చేయాల్సిందే" అన్నారు శేఖర్ మాష్టర్. "నేను వచ్చాను కాబట్టి హైపర్ ఆదికి మంచి పేరు వస్తుంది " అన్నాడు సుదర్శన్.."ఓహో మీ ఇద్దరి డాన్స్ కంపేర్ చేస్తారనా" అన్నారు శేఖర్ మాష్టర్. "కచ్చితంగా కంపేర్ చేస్తారు అందుకే ఆది నన్ను రావద్దు అంటాడు" అన్నాడు సుదర్శన్.
తర్వాత స్టేజి మీదకు కన్నా మాస్టర్ టీం వచ్చి డాన్స్ తో దుమ్ము లేపారు..వీళ్ళ టీం పేరు ఓరుగల్లు వీరులు..వీళ్ళ టీమ్ ని గంగవ్వ రిప్రెజంట్ చేసింది. ఐతే తన టీమ్ లో ఉన్నవాళ్ళంతా బక్కపలచగా ఉన్నారని చెప్పి మంచి బలంగా తయారు చేయడానికి వాళ్లకు ఆవకాయ అన్నం కలిపి అందరికి గోరు ముద్దలు తినిపించింది. ఇలా ఈ వారం నాలుగు టీమ్స్ తో ఈ ఎపిసోడ్ పూర్తయ్యింది. మరో నాలుగు టీమ్స్ ఎవరు వాళ్ళను రిప్రజంట్ చేస్తోంది ఎవరు అని తెలియాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే.
