English | Telugu

డోస్ పెంచిన బిగ్ బాస్ బ్యూటీ.. ఒక్క సినిమాకే మరీ ఇంతనా!

బిగ్ బాస్ సీజన్-6 ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ -6లో అందరికి గుర్తుండిపోయేవాళ్ళు కొందరే ఉన్నారు. అందులో ఇనయా సుల్తానా ముజిబుర్ రహమాన్ ఒకరు. తన స్ట్రాటజీతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇనయా. కాగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఏ విషయాన్ని‌ అయినా ముక్కుసూటిగా మాట్లాడే ఇనయా.. బిగ్ బాస్ తో ఎంతగానో ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది.

బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక.. టాస్క్ లలో తను బాయ్స్ ని డిఫెండ్ చేసిన తీరుకి సోషల్ మీడీయాలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఇనయా. అలా‌ ఇనయా బిగ్ బాస్ షోలో ఉండి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఇనయా సుల్తానా బిగ్ బాస్ షో తర్వాత బిజీ అయిపోయింది.

సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని పెట్టింది.‌ అందులో కుకింగ్ వీడియోలని, ఇంకా షాపింగ్ , జర్నీ వీడియోలంటూ అప్లోడ్ చేస్తూ బిజీ అయిపోయింది. కాగా తన ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంది. రీసెంట్ గా ఒక కారు కూడా కొన్న ఇనయా.. గత వారం ఐకియా నుండి ఫర్నీచర్ ని ఆర్డర్ చేసి.. వాటి అన్ బాక్స్ చేసి చూపించింది. అయితే తన గురించి ప్రతీ విషయాన్ని అభిమానులకు తెలియాజేయాలనే ఉద్దేశంతో.. ప్రతీ అప్డేట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది ఇనయా.

అయితే గతవారం తన‌కొత్త మూవీ అప్డేడ్ గురించి చెప్పింది ఇనయా. తను అంతకంటే ముందే మూడు సినిమాలలో నటించిందని చెప్పింది. కాగా తను నటించిన 'నటరత్నాలు' ఆడియో లాంఛ్ ఫంక్షన్ జరిగింది. అందులో తన అందాలతో అందరిచూపుని తనవైపుకి తిప్పుకుంది. ఇనయా‌ఈ డ్రెస్ తో ఉన్న ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. మొదటి సినిమాకే ఆ డ్రెస్ ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్లకి ఇనయా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.