English | Telugu

కమెడియన్ భద్రంకి పిచ్చిపట్టింది... తినకపోతే కారిపోతాది!

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి "ప్రసన్న వదనం" మూవీ టీమ్ వచ్చింది. ఇందులో సుహాస్, కమెడియన్ భద్రం, శరణ్య, రాశి వచ్చారు. అసలే సమ్మర్. వేడి సెగలు కొట్టేస్తోంది. ఇలాంటి టైంలో టైం ఆ వేడి తెలియకుండా ఉండడానికి సుమ వచ్చిన వాళ్లకు పుల్లైసు ఇచ్చింది. శరణ్య, రాశి ఇద్దరూ మాంగో ఐస్ తింటూ కనిపించారు. "మీకు ఈ పుల్లైసు తింటుంటే ఏమనిపిస్తోంది" అని సుమ అడిగేసరికి "తినకపోతే కారిపోతాది అనిపిస్తోంది" అంటూ శరణ్య జోక్ వేసింది. "జీవితం కూడా పుల్లైసు లాంటిదే. అందుకే అది కారిపోక ముందే మనం తినేయాలి. మనకు బతుకు ఉన్నప్పుడే బతికేయాలి " అని సుమ జీవిత సత్యం చెప్పింది.

Karthika Deepam2 :  కార్తిక్ ఫైర్.‌. దీప తల్లిని అని చెప్పిన సుమిత్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -26 లో.. దీప గురించి తెలుసుకోవాలని, తను వంట చేస్తుంటే హెల్ప్ చెయ్యాలని సుమిత్ర తన దగ్గరకి వెళ్ళి మాటకలుపుతుంది. నీ గురించి చెప్పు అంటు దీపని సుమిత్ర అడుగుతుంది. ఈ వంటలు ఎవరు నేర్పారని సుమిత్ర అడుగుతుంది. మా నాన్న వంట మాస్టర్ అని అనగానే.. అందుకేనా ఇలా వంటలు చేస్తున్నావని సుమిత్ర అంటుంది. మీరు కూడా నాకు మొదటిసారి భోజనం పెడుతుంటే.. పరిచయం అయ్యారని దీప అంటుంది.. ఆ తర్వాత నీకు, నాకు ఏదో సంబంధం ఉందని అనిపిస్తుందని సుమిత్ర అంటుంది.

చరణ్ అర్జున్ కి  ఈ సినిమాతో  బ్రేక్ దొరుకుతుందా!

కొంతమంది లిరిక్ రైటర్స్ ఎన్ని హిట్ సాంగ్స్ రాసిన పెద్దగా పేరు రాదు. అయితే ఎప్పుడైతే జనాల గుండెల్లో నిలిచిపోతూ.. సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంటుందో అప్పుడే  ఆ పాట రాసిందెవరని, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని తెలుసుకోవాలనే ఆలోచన వస్తుంది. అలాంటిదే ఈ మధ్య కాలంలో ఒక పాట ఫుల్ వైరల్ అయింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో సీఎమ్ రేవంత్ రెడ్డి మీద వచ్చిన పాటకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ పాటతోనే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం జనాల్లోకి మరింతగా వెళ్లిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆ పాటను చరణ్ అర్జున్ కంపోజ్ చేశాడు. 

Krishna Mukunda Murari : వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలి.. లేదంటే ప్రమాదమే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -451 లో.. కడుపునొప్పితో ఉన్న కృష్ణను అందరు కలిసి ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. అయితే కృష్ణకు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ పరిమిళ.. మురారీని తన క్యాబిన్‌కి రమ్మంటుంది. మురారి వెనుకే మీరా కూడా వినడానికి వెళ్తుంది. అదేసమయంలో మధుకి రేవతి కాల్ చేసి.. ఏడుస్తుంది. దానికి ఎలా ఉందిరా? కృష్ణకి నొప్పి తగ్గిందా? డాక్టర్ ఏమన్నారంటు మధుని రేవతి అడుగుతుంది. ఏం కాదు పెద్దమ్మా.. డాక్టర్ చూస్తున్నారు. అంతా బాగైపోతుంది.. మీరు బాధపడి.. పెద్దపెద్దమ్మను హడావిడి చేయొద్దని మధు అంటాడు‌. దాంతో రేవతి ఏడవడం ఆపేసి ఫోన్ పెట్టేస్తుంది.