Read more!

English | Telugu

రివ్యూవర్స్ కి అదిరే అభి ఛాలెంజ్....

 

అదిరే అభి జబర్దస్త్ లో ఎంత పేరు తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే. ఐతే తర్వాత కొత్త వాళ్ళ రాకతో జబర్దస్త్ నుంచి కొంతమంది సీనియర్స్ అంటే అభి, ధన్ రాజ్, వేణు ఇలా కొంతమంది షో నుంచి బయటకు వచ్చి సిల్వర్ స్క్రీన్ మీద తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. ఐతే అభికి మాత్రం అవకాశాలు తక్కువగానే వస్తున్నాయని చెప్పొచ్చు.

అలాంటి అభి తన ఇన్స్టాగ్రామ్ లో రివ్యూవర్స్ కి అదిరిపోయే ఒక టిప్ ఇచ్చాడు. చాలా మంది మూవీ రివ్యూస్ అవీ రాస్తున్నారు బానే ఉంది కానీ ఆ వీడియోకి  పెట్టే థంబ్ నెయిల్స్ రాడ్డు. నెగటివ్ థంబ్ నెయిల్స్ పెడితేనే జనాలు చూస్తారని చాలా మంది అలాగే చేస్తున్నారు. ఐతే అలాంటి థంబ్ నెయిల్స్ కారణంగా మూవీస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతోంది. నెగటివ్ థంబ్ నెయిల్స్ వలన చాలామంది మూవీస్ చూడక వెనక్కి వెళ్లిపోతున్నారు. అలా చాలా మూవీస్ కూడా నష్టాలపాలవుతున్నాయి. ఐతే మూవీస్ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఎన్నికల సమయం కదా.. ఏ నేత ఎలాంటివాడో ఎందుకు రివ్యూ చేయకూడదు అంటూ ఒక సలహా ఇచ్చాడు. ఎన్నికల సమయం కాబట్టి ప్రజలు ఎలాంటి నేతకు ఓటెయ్యాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు మీ పొలిటికల్ రివ్యూస్ బాగా యూజ్ అవుతాయి కదా. ఏ నాయకుడు ఎలాంటి వాడో చెప్తూ ఎం మంచి పనులు చేసాడో చెప్తే అది మనకు, మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. సినిమా రివ్యూస్ వలన జనాలకు పెద్దగా ఉపయోగం ఉండక పోవచ్చు. మీరే గనక నిజమైన రివ్యూవర్స్ ఐతే పొలిటిషన్స్ మీద వాళ్ళు చేసే పనుల మీద, వాళ్ళను ఎన్నుకుంటే వచ్చే లాభాలు, నష్టాలు ఏంటి అనే విషయాల మీద రివ్యూస్ చేసి పెట్టండి అని నవ్వుతూ చురకేశాడు. ఇక అభి ఇచ్చిన ఈ మెసేజ్ కి నెటిజన్స్ ఐతే "నిజం చెప్పావన్నా, గుడ్ ఛాలెంజ్ , రివ్యూస్ కారణంగా చాలా మూవీస్ కి కలెక్షన్స్ పోయాయి. చాలా కరెక్ట్ గా చెప్పావు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.