Read more!

English | Telugu

Brahmamudi : రుద్రాణి మాస్టర్ ప్లాన్.. అనామిక అడిగిన ప్రశ్నకు ఇంటిపెద్ద ఏం చెప్పనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -391 లో.. సీతారాముల కళ్యాణం జరిపించాలని చెప్పడానికి పంతులు గారు దుగ్గిరాల ఇంటికి వస్తాడు.. ఈసారి మీ నుండి ఏ ఇన్ఫర్మేషన్ లేదని నేనే వచ్చానని పంతులు అనగానే.. తరతరాలుగా మా కుటుంబీకులు ఈ కళ్యాణం జరిపిస్తున్నారు.. ఈసారి కూడా మా కుటుంబం జరిపిస్తుంది. దానికి కావలిసిన ఏర్పాట్లు చూడమని ప్రకాష్ కి ఇందిరాదేవి చెప్తుంది.

ఆ తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం సరైనదని అంటారా.. అని అపర్ణ అడుగుతుంది. తరతరాలుగా మన కుటుంబం వాళ్ళే చేస్తున్నారని ఇందిరాదేవి అంటుంది కానీ ఇప్పుడు మన తరానికి మచ్చ వచ్చిందంటూ, నేను రానంటూ అపర్ణ అంటుంది. ఇక దొరికేందే సందు అన్నట్లుగా రుద్రాణి రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఆ తర్వాత అపర్ణకి సుభాష్ నచ్చజెప్పుతాడు.అపర్ణకి ఇష్టం లేదని రాజ్ రానని అంటాడు. నువ్వు రాజ్ ని తీసుకొని రావాలి సీతారాముల కళ్యాణం జరిపించాలని కావ్యకి ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుందేంటని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఏం లేదు బానే జరుగుతుంది.. ఇప్పుడు గుడికి అందరం వెళ్తాము కదా.. అక్కడికి మీడియా వాళ్ళని రమ్మని చెప్పు. వాళ్ళు బాబు గురించి అడిగేలా చెయ్ అని రాహుల్ కి  రుద్రాణి చెప్తుంది.

ఆ తర్వాత గుడికి రమ్మని రాజ్ కి కావ్య చెప్తుంద.  నేను రానని రాజ్, మీరు రాకుంటే అక్కడ అంత అసంపూర్ణంగా  ఉంటుందని కావ్య అనగానే.. నేను వస్తేనే గొడవ అంత సంపూర్ణంగా జరుగుతుంది. ఆ బాబు ఎవరంటూ ఆడుగుతారు. ఏమైనా అంటే మీ అమ్మే కదా ఓర్చుకుంటే పోయేది ఏముందని రాజ్ కి కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు అప్పుని గుడికి రమ్మని కనకం చెప్తుంది. ఆ తర్వాత దుగ్గిరాల కుటుంబం మొత్తం గుడికి వస్తారు. మీడియా కూడా వస్తుంది... ఈ బాబు ఎవరని దుగ్గిరాల కుటుంబాన్ని మీడియావాళ్ళు అడుగుతారు. ఎవరో ఏంటి మా రాజ్ కొడుకు ఈ ఇంటికి వారసుడు అని రుద్రాణి చెప్తుంది. మరి ఆ విషయం ఎందుకు బయటపెట్టలేదని మీడియావాళ్ళు అడుగుతారు. తరువాయి భాగంలో రాజ్ కావ్య ఇద్దరు సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటే.. అనామికని రుద్రాణి పిలుస్తుంది. మీకే కళ్యాణం చేసే అర్హత ఉందని అనామికతో రుద్రాణి అనగానే.. అనామిక వెళ్లి రాజ్ బావ గారికి కళ్యాణం చేసే అర్హత ఉందా అని ఇందిరాదేవిని అడుగుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.