English | Telugu

Krishna Mukunda Murari : గుండెల్ని పిండేసే ఎపిసోడ్.. కుంతీదేవీ జపించిన మంత్రం ఇప్పుడుంటే బాగుండు కదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -452 లో.... మురారి, మధు, కృష్ణ ఇంటికి వస్తారు.‌ ఇక వాళ్ళిద్దరు డల్ గా ఉండడం చూసిన భవాని ఎందుకు డల్ గా ఉన్నారు? ఏమైందని అడుగుతుంది. నెలలు నిండినవాళ్ళు జరగకూడదనిదేదే జరిగినట్టుగా ఉందని అక్కడే ఉన్న రజినీ అంటుంది. నోటికి ఏదోస్తే అది మాట్లాడతావా అని రజినీకి భవానీ చివాట్లు పెడుతుంది‌.

మీరు అలా డల్ గా ఉంటే ఇలానే మాట్లాడతారని కృష్ణ, మురారీలతో రేవతి అంటుంది. దాంతో భవాని ఇద్దరిని యాక్టివ్ చేస్తుంది. అలా కడుపునొప్పి రాగానే కంగారుపడిపోయానని , చనిపోతానేమోనని, మీకిచ్చిన మాట నెరవేరకుండా ఉంటుందేమోనని చాలా భయపడ్డానని కృష్ణ అంటుంది. ఇక అదంతా చూస్తూ మురారి తనలో తానే కుమిలిపోతాడు. నీ మాట నెరవేరుతుందని మధు కాస్త ధైర్యం చెప్తాడు. ఇక కృష్ణకి పాలు, ట్యాబ్లెట్ ఇస్తుంది భవాని. ట్యాబ్లెట్ వేసుకున్న కృష్ణ నిద్ర వస్తుందనగా.. మురారి తనని గదిలోకి తీసుకెళ్తాడు. మరోవైపు ఇదంతా చూస్తూ మీరా అలియాస్ ముకుంద ఫుల్ హ్యాపీగా ఉంటుంది. మరోవైపు రేవతి దీర్ఘంగా ఆలోచిస్తుంటే.. మధు వచ్చి ఏంటని అడుగుతాడు. కృష్ణ గురించి భయం పెట్టుకోకని సంవత్సరం తిరిగేలోపు ఈ ఇంట్లో బుల్లి బాబో, పాపో వస్తారని ఆ బేవీ ఫోటోలు నేనే తీస్తానని మధు అనగానే.. అవునా .. అయితే ఓకే కానీ నేను ఆలోచిస్తుంది కృష్ణ గురించి కాదు అదర్శ్ గురించి అని రేవతి చెప్తుంది. ఏం అన్నాడని మధు అనగానే.. కృష్ణ గురించి మనం ఇంత టెన్షన్ లో ఉంటే వాడొచ్చి పెళ్లి గురించి మాట్లాడుతున్నాడని .. మీరాతో తన పెళ్ళికి భవాని అక్కకి చెప్పావా అని అడుగుతున్నాడని జరిగిందంతా మధుకి రేవతి చెప్తుంది. వాడేం చెయ్యలేడని మధు చెప్తాడు.

మరోవైపు గదిలో మురారి జరిగిందే తల్చుకుంటు బాధపడుతుంటాడు. అప్పుడే కృష్ణ లేచి చూసి.‌ ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతుంది. ‌అదేం లేదని కవర్ చేస్తాడు. కుంతీదేవి ఏ మంత్రం జపించిందో అది ఇప్పుడు చెప్తే తొందరగా బిడ్డని కనేయొచ్చు కదా అని కృష్ణ సరదాగా అంటే.. అవును ఇప్పుడు ఆ మంత్రం నిజమవుతే బాగుండని మురారి అంటాడు. అది లేకపోతే ఏంటి మీరు చెప్పిన ప్రేమ‌ మంత్రం ఉంది కదా ‌‌అని కృష్ణ అంటుంది‌. దానిని గట్టిగా ఫాలో అయ్యి పెద్దత్తయ్యకి ఇచ్చిన మాటని నెరవేరుద్దామని కృష్ణ అంటుంది. దానికి మురారి సరేనంటాడు. మరోవైపు మీరా తన సంతోషాన్ని చెప్పాడానికి ట్యాబ్లెట్ ఇచ్చిన వైదేహీకి కాల్ చేస్తుంది‌‌ . చాలా థాంక్స్ అని కృష్ణ కడుపునొప్పి తో హాస్పిటల్ కి వెళ్లిందని జరిగిందంతా చెప్తుంటే అప్పుడే అక్కడికి ఆదర్శ్ వస్తాడు. విన్నాడేమో అని మీరా కంగారుపడుతుంది. కాసేపటికి ఏంటని మీరా అడుగగా.. అందరి గురించి ఆలోచిస్తావ్.. నీ గురించి నేను ఆలోచిస్తానని ఆదర్శ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. మరోవైపు భవాని గదిలోకి రేవతి వచ్చి.‌. ఆదర్శ్ చెప్పిందంతా చెప్తుంది. దానికి భవానికి మరింత కోపంగా ఉంటుంది. తరువాయి భాగంలో ఓ బేబీ బొమ్మని కృష్ణకి మీరా ఇచ్చి.. ‌ఇలాంటి వారసుడిని ఇవ్వాలని అంటుంది. దానికి సరేనంటుంది కృష్ణ. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.