English | Telugu

తొలిరోజు దుమ్ము రేపిన ‘జవాన్’

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జవాన్’. ఈ మూవీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. అంచనాలకు తగ్గట్టే సినిమా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర తొలిరోజున ఈ చిత్రంవసూళ్ల సునామీని సృష్టించింది. మూడు భాషల్లో కలిపిి 75 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్స్‌ను రాబట్టింది. నార్త్‌లో  65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాగా..తమిళంలో 6.41 కోట్ల రూపాయలు.. తెలుగులో 5.29 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్ వచ్చాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటి వరకు ఉన్నపఠాన్ కలెక్షన్స్ సహా ఇతర బాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ రికార్డ్స్‌ని ఇది బద్దలు కొట్టి సరికొత్త చరిత్రను క్రియేట్ చేయటం విశేషం.

ప్ర‌భాస్‌, షారూఖ్‌కి స‌న్నీడియోల్ షాక్‌

పాన్ ఇండియా స్టార్స్ అయిన టాలీవుడ్ హీరో ప్ర‌భాస్‌, బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్‌ల‌కు సీనియ‌ర్ బాలీవుడ్ స్టార్ స‌న్నీడియోల్ షాకిచ్చారు. ఇదే ఇప్పుడు బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కీ ఏ విష‌యంలో అని అనుకుంటున్నారా? ప‌్ర‌త్యేకంగా దేనిగురించో చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌ద్ద‌ర్ 2 క‌లెక్ష‌న్స్ గురించే. దాదాపు 23 ఏళ్ల క్రితం వ‌చ్చిన గ‌ద్ద‌ర్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. దానికి కొన‌సాగింపుగా గద్ద‌ర్ 2 సినిమా ఈ ఏడాది ఆగ‌స్ట్ 11న రిలీజైంది. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్ కావ‌టంతో గ‌ద్ద‌ర్ 2పై మంచి హైప్స్ ఏర్ప‌డ్డాయి. అయితే స‌న్నీడియోల్ సినిమా చేసి చాలా రోజులు కావ‌టంతో సినిమా ఏం ఆడుతుందిలే అని అనుకున్న‌వాళ్లూ లేక‌పోలేదు.

మ‌రో సౌత్ స్టార్‌ను డీ కొట్ట‌నున్న సంజ‌య్ ద‌త్‌

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ ఇప్పుడు ద‌క్షిణాది సినిమాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. ఇప్పుడు సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాల హోరు ఎక్కువైంది. దీంతో సంజు బాబా అయితే బాలీవుడ్‌లో మార్కెట్ చేసుకోవ‌చ్చు. ఇక న‌టన ప‌రంగా ఆయ‌న‌కు ఏ వంకా పెట్ట‌లేం. దీంతో మ‌న ద‌క్షిణాది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సైతం సంజ‌య్ ద‌త్‌ను సంప్ర‌దిస్తున్నారు. ఆయ‌న భారీ రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేస్తున్నారు. అయితే కూడా మ‌న‌వాళ్లు త‌గ్గేదే లే అని అనేస్తున్నారు. ఇప్ప‌టికే కె.జి.య‌ఫ్ చిత్రంలో అధీరగా మార్కుల‌ను కొట్టేసిన సంజ‌య్ ద‌త్ ఇప్పుడు క‌న్న‌డ‌లో కె.డి అనే సినిమాతో పాటు త‌మిళంలో లియో సినిమాలో న‌టిస్తున్నారు. ఇక తెలుగు విష‌యానికి వ‌స్తే ప్ర‌భాస్‌, మారుతి సినిమాలోనూ న‌టిస్తున్నారు.

‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘జవాన్’. కోలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ సినిమాను తెర‌కెక్కించారు. సెప్టెంబ‌ర్ 7న తెలుగు, తమిళ‌, హిందీ భాష‌ల్లో మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీతో షారూఖ్ సౌత్ మార్కెట్‌పై గ్రిప్ పెంచుకోవాల‌నుకుంటున్నారు. అందుక‌నే డైరెక్ట‌ర్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం, సాంకేతిక నిపుణులంద‌రినీ ఇక్క‌డి వారినే తీసుకున్నారు. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని ఎంటైర్ కోలీవుడ్ ఇండ‌స్ట్రీ కోరుకుంటోంది. అందుకు కార‌ణం.. ఒక‌ప్పుడు బాలీవుడ్ త‌ర్వాత కోలీవుడ్ సినిమానే అన్నట్లు ఉండేది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్‌నే డామినేట్ చేసి పారేస్తుంది. దీంతో కోలీవుడ్ మేక‌ర్స్ పోటీ ప‌డీ మ‌రీ సినిమాలు తీస్తున్నారు. కోలీవుడ్ నుంచి విక్ర‌మ్‌, జైల‌ర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.