English | Telugu

రోజాతో లేడీ ఓరియెంటెడ్ మూవీ..

డ్రామా జూనియర్స్ ప్రోమోనే ఒక ఫుల్ ఎపిసోడ్ లా ఉంది. ఇక ఏ సీజన్ లేనంతగా ఈ సీజన్ ఫుల్ జోష్ ని అందిస్తోంది ఆడియన్స్ కి. అందులో ఈర్య అనే చిన్నారి అనిల్ రావిపూడిని మామా మామ అనడం అనిల్ కూడా ఆమెతో ముచ్చట్లు పెట్టడం ఈ సీజన్ లో బాగా హైలైట్ అయ్యాయి. ఇక ఈ న్యూ ప్రోమోలో అనిల్ రావిపూడి హోస్ట్ సుధీర్ ని బాగా రోస్ట్ చేసాడు. "ఏంటి సర్ ఈ సెటప్ అంతా" అంటూ అనిల్ రావిపూడిని అడిగాడు సుధీర్. "రోజా గారిని హీరోయిన్ గా పెట్టి ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేద్దామనుకుంటున్నా" అన్నాడు. "మీరు ఆమెను బిజీ చేస్తారు.

నన్ను మాత్రం బిజీ చేయరు" అంటూ సుధీర్ అనిల్ మీద కౌంటర్ వేసాడు. ఆయన ఊరుకోకుండా "నిన్ను బిజీ చేస్తే నేను ఖాళీ అవుతాను కదా" అనేశాడు. ఇంతలో రోజా "ఈరోజు ముహూర్తం షాట్ అన్నారు కదా సినీ పెద్దలెవరైనా వస్తున్నారా" అంటూ అడిగింది రోజా. "ఆల్రెడీ పెద్దవాళ్లతోనే సినిమా తీస్తుంటే మళ్ళీ సినీ పెద్దలు ఎందుకండీ" అంటూ సుధీర్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ప్రోమో ఫైనల్ లో రిక్షాలో ఈర్య చిరంజీవి కటౌట్ తో అదిరిపోయే గెటప్ తో ఎంట్రీ ఇచ్చింది. దాంతో సుధీర్ "ఈర్య ఏంటి హడావిడి..ఎవరు వీళ్లంతా" అని అడిగాడు. వెంటనే చిరంజీవి కటౌట్ చూసి షాకయ్యాడు. "ఏంటి చిరంజీవిగారితో నటిస్తున్నావా" అన్నాడు. "లేదు చిరు మామే నాతో నటిస్తున్నారు" అని చెప్పింది ఈర్య. "అసలు నీకెవరు ఛాన్స్ ఇచ్చారు" అన్నాడు సుధీర్ ఆశ్చర్యంగా ."అనిల్ మామ" అని చెప్పింది. అంతే సుధీర్ వెంటనే "పనోడి క్యారెక్టర్ అన్నా నాకు ఇవ్వాలనిపించలేదా మీకు..ఛాన్స్ నాకు ఇవ్వకుండా తనకు ఇచ్చారు.. ఎలా ఛాన్స్ ఇచ్చారో నాకు ఇప్పుడు తెలియాలి " అన్నాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.