English | Telugu

Brahmamudi : బెయిల్ పై అప్పుని తీసుకొచ్చిన కావ్య.. రేవతి ఎవరంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -771 లో..... అప్పు సస్పెండ్ అవ్వడంతో తన యూనిఫామ్ ని స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇక సెల్ లోకి వెళ్ళండి అని ఏసీబి వాళ్ళు అప్పు తో అంటారు. అప్పుడే అప్పుకి బెయిల్ తీసుకొని వస్తుంది కావ్య. ఇంత త్వరగా ఎలా బెయిల్ వచ్చిందని ఆఫీసర్ అడుగగా అప్పుకి ఇంతకి ముందు ఎలాంటి నేర చరిత్ర లేదు అందుకే త్వరగా వచ్చిందని కావ్య తీసుకొని వచ్చిన లాయర్ అంటాడు.

ఆ తర్వాత అప్పు గురించి ఆఫీసర్ తప్పుగా మాట్లాడుతుంటే.. మా అప్పు దుగ్గిరాల ఇంటి కోడలు అనీ కావ్య అనగానే అలాంటి కుటుంబం లో ఉంటూ ఇలా చెయ్యడమేంటని ఆఫీసర్ అనగానే మా చెల్లి ఏం తప్పు చెయ్యలేదు. నేను నిరూపిస్తానని కావ్య అంటుంది. సరే ఎల్లుండి కోర్ట్ కి అయితే రండి అని ఆఫీసర్ అంటాడు. రాజ్ డిస్సపాయింట్ గా ఇంటికి వెళ్తాడు ఏమైందని యామిని అడుగుతుంది. అప్పు సస్పెండ్ అయిందని కావ్య వెళ్ళిందనగానే కావ్యని ప్రపోజ్ నుండి తప్పించుకోవాలని లా చేసిందేమోనని యామిని అంటుంటే అలా కావ్య చెయ్యదని యామినితో కోపంగా మాట్లాడుతాడు రాజ్.

మరొకవైపు అప్పు లంచం తీసుకొని దొరికిపోయిందని ఇంట్లో వాళ్లకి చెప్తుంది రుద్రాణి‌. అప్పుడే కావ్య, అప్పు ఇంటికి వస్తారు. ఎందుకు ఇలా చేసావని ధాన్యలక్ష్మి అప్పుపై కోప్పడుతుంది. నా చెల్లి ఏం తప్పు చెయ్యలేదని నిరూపిస్తాను లేదంటే నా చెల్లి మీకు నచ్చినట్టుగా ఉంటుందని కావ్య అంటుంది. తరువాయి భాగంలో రేవతి దగ్గరికి ఇందిరాదేవి వెళ్తుంది. రేవతి నానమ్మ అంటూ ఇందిరాదేవిని హగ్ చేసుకుంది. అప్పుడే కావ్య, రాజ్ రేవతి వాళ్ళ డోర్ కొడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.