English | Telugu
Karthika Deepam2 : పారిజాతం ముందు నోరుజారిన జ్యోత్స్న.. దీపే అసలైన వారసురాలు!
Updated : Jul 12, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -407 లో.....జ్యోత్స్న తన గదిలోకి వస్తుంది. టెడ్డి బేర్ లో ఉన్న రింగ్స్ ఏమయ్యాయని చూస్తుంటే అందులో లేకపోయేసరికి ఏంటి రింగ్స్ బావ తీసుకున్నాడంటే.. దీని అర్ధం ఏంటి నేను పెళ్లి వద్దని అనుకుంటున్న విషయం బావకి తెలిసిపోయిందని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే పారిజాతం కోపంగా వచ్చి జ్యోత్స్న చెంపచెల్లుమనిపిస్తుంది.
ఏంటి గ్రానీ అనీ జ్యోత్స్న అడుగుతుంది. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది. నేను నీ గురించి ఇదంతా చేస్తుంటే నువ్వేంటే ఇలా చేస్తున్నవని పారిజాతం అడుగుతుంది. నేను పెళ్లి వద్దని అనుకుంటున్న విషయం బావకి తెలిసిపోయిందని జ్యోత్స్న అనగానే.. తెలిసిపోతేనే కదా రింగ్స్ తీసిందని పారిజాతం అంటుంది. బావకి అసలైన వారసురాలు తెల్సిపోయి ఉంటుంది.. బావ అమ్మకి మేనల్లుడు.. దీప అమ్మ కూతురు అని జ్యోత్స్న అనగానే పారిజాతం షాక్ అవుతుంది. దాంతో వెంటనే జ్యోత్స్న కవర్ చేస్తుంది. మరొకవైపు దీప, కార్తీక్ మాట్లాడుకుంటుంటే వెనకాల నుండి పారిజాతం, జ్యోత్స్న వస్తారు. వాళ్ళు వచ్చిన విషయం కార్తీక్ చూసి వాళ్ళు మాట్లాడుకునే టాపిక్ డైవర్ట్ చేస్తాడు. రోజ్ ఫ్లవర్ తెంపి దీప తల్లో పెడతాడు. అది చుసిన పారిజాతం.. ఎందుకు అలా నా పర్మిషన్ లేకుండా తెంపావని గొడవపడుతుంది.
ఆ తర్వాత శివన్నారాయణ వచ్చి.. దానికి ఎందుకు గొడవ చేస్తున్నావని పారిజాతంపై కోప్పడతాడు. మరొకవైపు కార్తీక్ తో దశరథ్ మాట్లాడతాడు. జ్యోత్స్న ఎంత చెడ్డది అయిన నా కూతురు రా.. అసలు గౌతమ్ ఎలాంటి వాడని దశరథ్ అడుగుతాడు. మీకు అయితే అన్యాయం జరగదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత సుమిత్రకి దీప కాఫీ తీసుకొని వస్తుంది. మళ్ళీ ఎప్పటిలాగే దీప బాధపడేలా సుమిత్ర మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.