English | Telugu

శ్రీరామచంద్రకి పెళ్లి ఫిక్స్...ఇంతకీ ఎప్పుడంటే....

శ్రీరామచంద్ర టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సింగర్. బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మరింత పేరు తెచ్చుకున్నాడు. సుమారు 15 ఏళ్ళ నుంచి సాంగ్స్ పాడుతూ ఉన్నా కూడా ఏమంత నేమ్, ఫేమ్ రాలేదు కానీ బిగ్ బాస్ ద్వారా బాగా లైంలైట్ లోకి వచ్చాడు. అలాంటి శ్రీరామచంద్ర ఇంకా పెళ్లి చేసుకోకుండా నచ్చిన అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీరామచంద్ర తన ఇన్స్టాగ్రామ్ ద్వారా "ఆస్క్ మీ ఆ క్వశ్చన్" టాస్క్ ఇచ్చాడు ఫాన్స్ కి.

ఇక నెటిజన్స్ అందరూ ఓ రేంజ్ లో ప్రశ్నలు అడిగారు. అందులో ఒక నెటిజన్ ఇంకొంచెం ముందుకెళ్లి "ఐ లవ్ యు...నన్ను పెళ్లి చేసుకుంటావా" అని అడిగేసరికి "ఒకే..ఫిబ్రవరి 30 న పెళ్లి చేసుకుందాం" అని కొంటెగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. "టాటా ఫామిలీకి పాటలు పాడటం మీద మీ అభిప్రాయం" అని అడిగేసరికి " పిచ్చ ఎనర్జీ వచ్చేసింది అక్కడున్న క్రౌడ్ చూసి...ఆ ఊపులో డాన్స్ కూడా వచ్చేసింది" అని చెప్పాడు. "హిమేష్ సర్ మీద మీ సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు" అనేసరికి "మరొక నెలలో రిలీజ్ చేస్తాను" అని చెప్పాడు. "అల్లు అర్జున్ ని కలిసారా" అనడంతో " ఇంకా లేదు కానీ ఆయన్ని కలవాలని ఉంది..ఆయన పనితనం నాకు చాలా నచ్చుతుంది...బద్రీనాథ్ లో ఒక సాంగ్ పాడాను" అని చెప్పాడు.

"తెలుగు ఇండియన్ ఐడల్ 2 లో మీరెందుకు లేరు" అని అడిగిన ప్రశ్నకు " ఈ జీవితంలో కొంతమందిని రీప్లేస్ చేయడం కష్టం.. ఇప్పుడున్నవాళ్లకు గుడ్ లక్" అని చెప్పాడు. ఇలా రామ్ తన ఫాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. శ్రీరామచంద్ర సింగర్ మాత్రమే కాదు నటుడు కూడా.."జగద్గురు ఆదిశంకరాచార్య" మూవీలో రాజా అమర్కర పాత్రలో కనిపించాడు. "ప్రేమ గీమా జాన్తా నై"మూవీలో కూడా కనిపించాడు. ఇలా శ్రీరామచంద్ర మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.