English | Telugu

మ్యారేజ్ డేట్ బ్రో..భోజనాలకు వస్తాం...

ఆర్జే సూర్య బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆరోహితో మంచి సందడి చేసాడు. ఇప్పుడు బీబీ జోడిలో ఫైమాతో కలిసి డాన్స్ ఇరగదీస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సూర్య తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. "కీర్తితో మీ ఫ్రెండ్ షిప్ అలాగే ఉందా ?" "మా వర్క్స్ లో మేము బిజీగా ఉన్నాము..ఇప్పటి వరకు కలవలేదు" అని చెప్పాడు. "మ్యారేజ్ డేట్ బ్రో..భోజనాలకు వస్తాం" అని అనేసరికి " డెఫినెట్లీ మామ..మ్యారేజ్ సెటిల్ అవగానే ఇన్స్టాగ్రామ్ లో కార్డు అప్ డేట్ చేస్తాను. మా ఇంట్లో గట్టిగానే పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు" అని చెప్పాడు. "మీరు చాలా హ్యాండ్ సం గా ఉంటారు మూవీస్ కి ఎందుకు ట్రై చేయరు " అనడంతో " తమిళ్, తెలుగు, కన్నడలో త్వరలో రాబోతున్న ఒక మూవీలో లీడ్ క్యారెక్టర్ కి సైన్ చేసాను.

అంతకన్నా ముందు నా కంటెంట్ తో యూట్యూబ్ ద్వారా మిమ్మల్నందరినీ సర్ప్రైజ్ చేయాలని" అంటూ చెప్పాడు. "మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమిటి" అని అడిగిన నెటిజన్ కి " క్రికెట్ కి రిలవెంట్ గా ఉన్న ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా" అన్నాడు. "మీది ఆంధ్రనా తెలంగాణానా" అని అడగడంతో "ఆంధ్రప్రదేశ్ జన్మనిచ్చింది...తెలంగాణ బతుకునిచ్చింది. నేను రెండు ప్రాంతాలకు చెందిన వాడిని" అని చెప్పాడు. "కీర్తి, ఆరోహి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే" అనేసరికి "టైంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఫోన్ చేయగలిగిన బెస్టీ ఆరోహి..నాకు ఇష్టమైన పిచ్చి ఫెలో కీర్తి..మెం ముగ్గురం కలిస్తే రచ్చే...కానీ కలిసేది చాలా తక్కువ" అని చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.