English | Telugu

నేను మీ బాలయ్య..కాదు మీ 12 మందికి మావయ్య

ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో హిట్ అయిన షోస్లో అన్నిటిలోకి తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. యువ గాయనీగాయకులకు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ సింగింగ్‌ షో మంచి వేదికగా నిలుస్తోంది. ఫస్ట్ సీజన్ లో జయంత్, వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, ప్రణతి లాంటి తెలుగు గాయనీగాయకులు తమ పాటలతో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఆడిషన్స్ ముగిసి టాప్ 12 కంటెస్టెంట్స్ ఎంపికయ్యారు.

న్యూ జెర్సీ నుంచి శృతి నండూరి, విశాఖపట్నం నుంచి సౌజన్య, బెంగళూరు నుంచి యుతి హర్షవర్ధన, విశాఖ నుంచి అయ్యన్ ప్రణతి, సిద్ధిపేట నుంచి లాస్య ప్రియా, హైదరాబాద్ నుంచి కార్తికేయ, సాకేత్, జయరాం, మానస, ఆదిత్య, విజయవాడ నుంచి సాయి వైష్ణవి, పలాస నుంచి చక్రపాణి ఎంపికయ్యారు. నెక్స్ట్ వీక్ నుంచి ఇడియన్ ఐడల్ 2 యుద్ధం మొదలుకాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి "గాల విత్ బాల" పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య బాబు సందడి న భూతో న భవిష్యత్ అన్నట్టుగా ఉంది. "ఐడల్ చరిత్రలో ఇదొక బిగ్గెస్ట్ ఈవెనింగ్.

ఈ సీజన్ సెట్ చేయనుంది నెవర్ బిఫోర్ న్యూ ట్రెండ్..నేను మీ బాలయ్య..కాదు మీ 12 మందికి మావయ్య" అంటూ టాప్ 12 కంటెస్టెంట్స్ కి అదిరిపోయే స్టెప్స్ వేశారు. "వీళ్ళే మన టాప్ 12 ..ఇక దునియాను కుమ్మేయడం మొదలు"...అంటూ ఇండియన్ ఐడల్ స్టేజి మీద రచ్చ చేశారు. ఈ సీజన్ మార్చ్ 17 నుంచి ప్రతీ శుక్ర-శని వారాల్లో రాత్రి 7 గంటలకు ప్రసారం కాబోతోంది. ఈ తాజా సీజన్‌లో సింగర్‌ హేమచంద్ర సింగింగ్‌ షోకు హోస్ట్‌గా చేస్తుండగా జడ్జీలుగా థమన్, కార్తిక్, గీతామాధురి వ్యవహరిస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.