English | Telugu

నందుకి బాగైతే నా పేరొద్దు.. నీ పేరు చెప్పు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -104 లో.. "నీ భార్యని నందు గురించి పట్టించుకోవద్దని చెప్పు" అని మురారితో ముకుంద అనగానే.. తను నందు బాగుండాలనే చూస్తుంది కదా అని మురారి అంటాడు. నువ్వు అలా కృష్ణ కి సపోర్ట్ చేస్తూ వస్తే నిన్ను ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటే నేను చూస్తుండలేను. నువ్వు కృష్ణకి సపోర్ట్ చేయకు అని ముకుంద అంటుంది. "అయినా అదేదో సామెత అన్నట్లు కత్తికి లేని దురద కందకి ఎందుకు అన్నట్లు మా పెద్దమ్మ, బాబాయ్ లు నన్ను అంటే నీకేం బాధ" అని మురారి అంటాడు. "అవునా.. సరే వెళ్ళు. ఇక వెళ్ళి కృష్ణని తీసుకొని రా" అని ముకుంద అనగానే.. అవును వెళ్ళాలి ఈ రోజు కృష్ణ కూడా త్వరగా వస్తానందని మురారి అంటాడు. కోపంలో ఉన్న ముకుంద.. "మధ్యలో పానీపూరి కూడా తినిపించు" అని వెటకారంగా అంటుంది. అలా తను అనగానే అవును కృష్ణకు పానీపూరి అంటే ఇష్టమని మురారి చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి మురారి వెళ్ళిపోతాడు.

మరోవైపు నందు ఫోటో చూస్తుంటాడు గౌతమ్. ఇంతలో కృష్ణ రావడంతో తనని చూసిన గౌతమ్.. "అలా అడగకుండా లోపలికి వస్తావా" అని కోప్పడతాడు. నందు గురించి నీ ద్వారా తెలుసుకోవడానికి ఇలా కోపంగా మాట్లాడుతున్నా లేదంటే నీకు డౌట్ వస్తుందని‌ గౌతమ్ తన మనసులో అనుకుంటాడు. నందుకి ఈ టాబ్లెట్స్ ఇవ్వు.. ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఈ హాస్పటల్ కే తీసుకొని రా, నందుకి బాగైతే నా పేరు కాకుండా నీ వల్ల బాగైందని చెప్పు అని గౌతమ్ అనగానే.. సరేనంటుంది కృష్ణ. సర్ ఈ రోజు త్వరగా వెళతానని కృష్ణ పర్మిషన్ అడుగగా.. దానికి ఓకే చెప్తాడు గౌతమ్.

కృష్ణకి తెలియకుండా తనకోసం మురారి ఒక చీర తీసుకుంటాడు. దాన్నిచ్చి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత మురారికి కాల్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ హడావిడిలో ఆ చీరని సోఫాలో పెడతాడు. ఫోన్ మాట్లాడి వచ్చేసరికి సోఫాలో చీర ఉండదు. దీంతో చీర ఏమైందని ఆలోచిస్తుంటాడు మురారి. మరోవైపు కృష్ణకి కాలేజీలో లేట్ అవడంతో గౌతమ్ తనని తన బైక్ మీద తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.