English | Telugu
వారిద్దరి ప్లాన్ సక్సెస్.. తనని తీసుకెళ్ళలేదని దేవయాని ఏడుపు!
Updated : Mar 15, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -710లో.. దేవయాని తన భర్తతో.. అసలు వీళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారు.. రాను రాను ఇంట్లో నేను అంటే గౌరవం లేకుండా పోయిందని అంటుంది. ఇంతలోనే రిషి, వసుధారలు సంతోషంగా హోలీ జరుపుకొని ఇంటికి అందరూ ఒకేసారి వస్తారు.. అలా ఒంటి మీద రంగులతో వచ్చిన అందరిని చూసి కోపంతో ఊగిపోతుంది దేవయాని. మీరంతా ఎక్కడికి వెళ్ళారని దేవయాని అడుగుతుంది. అప్పుడు వసుధార వచ్చి దేవయానిని హాగ్ చేసుకొని హ్యాపీ హోలీ అని చెప్తుంది. హోలీ జరుపుకొని వస్తున్నాం పెద్దమ్మ.. నాకు చాలా హ్యాపీ గా ఉందంటూ దేవయానితో రిషి చెప్తాడు. మరి మాకెందుకు చెప్పలేదు. చెప్తే మేం కూడా వచ్చేవాళ్ళం కదా అని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత కాసేపటికి స్వీట్ చేసి తీసుకొస్తాను అని వసుధార అంటుంది.
ఆ తర్వాత ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నానని వసుధారతో రిషి అంటాడు. థాంక్స్ సర్ అని వసుధార అనగానే.. నేనే నీకు థాంక్స్ చెప్పాలని రిషి అంటాడు. డాడ్ వాళ్ళతో ఇలా పండగ సెలబ్రేట్ చేసుకువడం చాలా హ్యాపీగా ఉందని రిషి అనగానే.. మీ కళ్ళలో మెరుపు.. మీ పెదాల్లో సంతోషం.. ఇవే నాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చాయి సర్ అని వసుధార అంటుంది. మొత్తానికి మంచి ప్లాన్ చేసి రిషి, వసుధారలు కలిసి హ్యాపీగా పండగ సెలబ్రేట్ చేసుకునేలా చేసారని జగతితో మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార, రిషి లు హోలీ సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుంటారు. అక్కడికి దేవయాని వచ్చి.. రిషి నువ్వు అంత సంతోషంగా ఉన్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్తే నీ సంతోషాన్ని చూసేదాన్ని కదా.. మీరంతా నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు. సెలబ్రేషన్ ఇక్కడే అందరం చేసుకునేవాళ్ళం కదా.. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్ అంటూ వసుధారని బ్లేమ్ చేసేలా మాట్లాడుతుంది దేవయాని. ఆ మాటలు విన్న రిషి.. వసుధార తప్పు చేసావ్.. ఇంకోసారి పెద్దమ్మని పిలవకుండా ఏం చెయ్యకని అంటాడు.
ఆ తర్వాత అందరూ భోజనం చేస్తూ.. ధరణి భర్త గురించి మాట్లాడుకుంటారు. అన్నయ్యని రమ్మనచ్చు కదా పెద్దమ్మా అని రిషి అంటాడు. వాడికి చాలా అగ్రిమెంట్ లు ఉన్నాయి.. రావడం ఇప్పట్లో వీలు అవదని దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.