English | Telugu

తనకి ఆ నిజం చెప్పేసిన వసుధార..!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -742 లో.. సౌజన్య రావు చెప్పిన ప్రపోజల్ ని జగతి, వసుధారలు వద్దని చెప్పి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక మహేంద్రకి అక్కడ జరిగిందంతా చెప్తారు.. రిషి మెడికల్ కాలేజీ గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలని జగతి అంటుంది. ఇది చెప్పి రిషి ఆనందాన్ని ముక్కలు చేసిన వాళ్ళమవుతామని మహేంద్ర అంటాడు. ఆ సౌజన్యరావు ఖచ్చితంగా ఏదో కుట్రతోనే ఈ ప్రపోజల్ తో మన ముందుకి వచ్చాడని వసుధార అంటుంది. రిషి ఎంత బాధపడతాడో అని జగతి అనగానే.. వసుధార అని పిలుచుకుంటూ రిషి లోపలికి వస్తాడు.. వెళ్లిన పని ఏమైంది మేడం.. మీరు ఓకే చేసే ఉంటారు.. నాకు తెలుసని రిషి అంటాడు. వసుధార పదా వెళ్దామని తనని పక్కకి తీసుకొని వెళ్ళి.. రిషికి టైం చూసుకొని సౌజన్యరావు ప్రపోజల్ గురించి చెప్పమని జగతి చెప్తుంది.

నువ్వు పూజకు పనికి రాని పువ్వు అన్న శ్రద్దా..అవాక్కైన జెస్సి

ఢీ షో ప్రతీ వారం మస్త్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. వచ్చే వారం షో మొత్తం కూడా డాన్స్ మాస్టర్స్ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఒక్కో డాన్స్ మాస్టర్ ఒక్కో రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి వావ్ అనిపించారు. చైతన్య మాస్టర్ స్టేజి మీదకు వచ్చి "సర్" మూవీ నుంచి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేసి అదరగొట్టాడు. మధ్యలో జడ్జి శ్రద్దా వచ్చి చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. చైతన్య మాస్టర్ ఎంతో పర్ఫెక్ట్ గా స్టెప్స్ వేయడంతో శేఖర్ మాస్టర్ కూడా ఇంప్రెస్ ఐపోయి "చైతన్య వచ్చాక నా కళ్ళు ఎటూ వెళ్ళలేదు అతని మీదే వున్నాయి" అని కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. ఈ సాంగ్ ఐపోయాక స్టేజి మీద  కాసేపు నవ్వులు పూయించడానికి జెస్సి, దివ్య వచ్చేసారు. "ఆవిడేంటి అంత వణుకుతోంది" అని ప్రదీప్ అడిగేసరికి "దివ్యకి బాగా చలేస్తోంది అంట" అన్నాడు జెస్సి.

ఒంటిపై కిరోసిన్ పోసుకున్న స్వప్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -75 లో.. స్వప్నని చుసిన కనకం ఆవేశంతో తిడుతుంది. ఏ మొహం పెట్టుకొని వచ్చావే.. నువ్వు ఎప్పుడో చచ్చావే.. మళ్ళీ ఎందుకు వచ్చావ్.. నువ్వు రాగానే కన్నా ప్రేమ కరిగిపోతుందనుకున్నావా? నువ్వు చేసిన పనికి నీపై ఉన్న ప్రేమ చచ్చిపోయింది. ఇక్కడ నుండి వెళ్ళమని స్వప్నతో కనకం అంటుంది. ఇంతలో కృష్ణమూర్తి గదిలో నుండి వచ్చి.. దీన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారంటూ.. స్వప్న మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. నాన్న అని స్వప్న అనగానే.. అలా పిలవకు.. నీతో నాన్న అని పిలిపించుకోవడం కంటే... నాకు ఇద్దరే కూతుర్లు అని చెప్పాడంలో నాకు గౌరవం ఒక గౌరవంగా ఉంటుందని కృష్ణమూర్తి అంటాడు.

గౌతమ్ పెళ్ళి తనకు నచ్చిన అమ్మాయితో జరుగుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -136 లో.. కృష్ణపై నుండి కిందకి వస్తుంది. ఇక అంత హాల్లో ఉండడం చూసి.. ఏసీపీ సర్ కి నేను నిజం చెప్పినట్లు తెలియకుండా మాట్లాడాలని కృష్ణ అనుకుంటుంది.  సర్ ఏంటి అలా ఉన్నారు.. ఏదో చెయ్యకూడనిది చేస్తున్నట్లని కృష్ణ అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న ముకుంద.. నువ్వు కాలేజీకి వెళ్ళు.. మురారికి పెద్ద అత్తయ్య గారు ఒక పని అప్పజెప్పారు.. నువ్వేమైనా చిన్న పిల్లవా కాలేజీ కి ఒక్కదానివి వెళ్లలేవా అంటుంది. వెళ్తాను మీ పనికి మీరు వెళ్ళండి.. నా పనికి నేను వెళ్తాను.. ఎవరి పని ముందు అవుతుందో చూడాలని అంటుంది కృష్ణ.  ఆ తర్వాత భవాని దగ్గరికి వెళ్ళిన కృష్ణ.. అత్తయ్య నన్ను ఆశీర్వదించండి.. ఈ రోజు నేను ఆపరేషన్ పూర్తి చేస్తున్న అని చెప్పి తన ఆశీర్వాదం తీసుకుంటుంది. సర్ బయట వరకు నాతో రండని చెప్పి మురారిని తీసుకువెళ్తుంది కృష్ణ. ఇక కృష్ణ, మురార ఇద్దరు బయటకు వెళ్లగానే.. ఈ తింగరి పిల్లకి నిజం ఏమైనా తెలిసిందా అని భవాని అనగానే.. లేదు వదిన తెలిస్తే కృష్ణ అసలు ఇలా ఉండేది కాదని ఈశ్వర్ అంటాడు

మీ ఇద్దరి మధ్య ఏ విభేదాలు రాకుండా నేను చూసుకుంటాను!

స్టార్ మా టీవీలో ప్రసారమవవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -135 లో.. మా పెద్దమ్మ, కృష్ణలకి మాటిచ్చానని మురారి ఆలోచిస్తుంటాడు. మరోవైపు కృష్ణని తీసుకొని రేవతి మేడపైకి వెళ్తుంది. అసలు ఏం చేస్తున్నావ్ కృష్ణ అని రేవతి అడుగుతుంది.. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపి గౌతమ్ సర్ తో నందిని పెళ్లి చేస్తానని కృష్ణ అంటుంది. మధ్యలో నీ కాపురం ఏమవుతుందో అని నాకు టెన్షన్ గా ఉంది కృష్ణా అని రేవతి అనగానే.. మీరేం టెన్షన్ పడకండి.. ఏసీపీ సర్ నాకు మాటిచ్చాడు.. నందు గురించి ఏసీపీ సర్ కి నిజం చెప్పాను.. అంతా సర్ చూసుకుంటానని అన్నాడని కృష్ణ అంటుంది. అటు వాళ్ళ పెద్దమ్మకి మాటిచ్చాడు. ఇటు నీకు ఇచ్చాడని రేవతి అంటుంది. భవాని అత్తయ్యకి కూడా మాట ఇచ్చాడా అని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. ఏసీపీ సర్, భవాని అత్తయ్యల మధ్య ఏ విబేధాలు రాకుండా నేను చూసుకుంటాను.. మీరు వెళ్లి ప్రశాంతంగా పడుకోండని రేవతికి చెప్పి తనని పంపించేస్తుంది కృష్ణ