Read more!

English | Telugu

ఆ ఇద్దరితో కిస్ టేబుల్ చెప్పించిన శ్రీముఖి

నాగపంచమి సీరియల్ స్టార్ మాలో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇదొక డివోషనల్ సీరియల్ కావడంతో తెలుగు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అందులోనూ హీరో హీరోయిన్స్ కొత్తవాళ్లు కావడం, సీరియల్ కూడా కొంచెం ఫ్రెష్ గా ఉండేసరికి రాత్రి 8 ఐతే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు అభిమానులు. 

ఇక ఈ సీరియల్ టీం హీరోహీరోయిన్స్ ఇద్దరూ ఈ వారం ప్రసారం కాబోయే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఎపిసోడ్ లోకి వచ్చి కాసేపు ఎంటర్టైన్ చేశారు. శ్రీముఖి కూడా వీళ్ళను బాగా ఆటపట్టించింది. "షూటింగ్ ఐపోయాక డిన్నర్ కి వెళ్లడం అలా ఏమన్నా ఉందా " అంటూ శ్రీముఖి నాగపంచమి సీరియల్ హీరో, హీరోయిన్స్ ని అడిగింది. "నువ్వు ఏదో కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నావ్" అంది సీరియల్ హీరోయిన్. "హే నేను ఎలాంటి కాంట్రవర్సీ చేయడం లేదు" అని శ్రీముఖి ఏదో చెప్పి తప్పించుకుంది. తర్వాత "ఆ అమ్మాయిని  ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏమిటి " అని సీరియల్ హీరోని అడిగేసరికి "అమ్మాయి చాలా  క్యూట్ గా ఉంది అనిపించింది" అని చెప్పాడు. "ఇంతకు ఆమె ఫేవరెట్ ఫుడ్ ఏమిటో తెలుసా " అని అడిగేసరికి "మటన్" అని చెప్పాడు. "షూటింగ్ లొకేషన్ లో అది ఎలాగూ పెట్టరు కాబట్టి బయట ఎక్కడికైనా డిన్నర్ కి కలిసి వెళ్తారు"అనుకుంటున్నా అని శ్రీముఖి అనేసరికి "చెప్పాలంటే తనకు వాళ్ళ అమ్మ ఆ డిష్ ప్రిపేర్ చేసి తీసుకొస్తారు" అని చెప్పాడు. దాంతో "అత్తమ్మగారు కూడా తెలుసా మీకు" అని వాళ్ళ బండారం బయట పెట్టడానికి ఆడియన్స్ కి ఒక్కో హింట్ ఇస్తూ వచ్చింది. 

ఇక సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న "దసరా" మూవీ సాంగ్ కి నాగపంచమి సీరియల్ హీరో, హీరోయిన్ ఇద్దరూ కలిసి మాస్ పెర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టారు. ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ పూర్తయ్యాక  ఇద్దరికీ మరో టాస్క్ ఇచ్చింది. ఇద్దరి చేత కిస్ టేబుల్ చెప్పించింది. కిస్ వన్ జార్ కిస్, కిస్ టు జార్ కిస్ కిస్ ఇలా ఇద్దరి చేత వెరైటీ టాస్క్ చేయించింది. అలా ఈ వారం కొత్త సీరియల్ టీమ్స్ వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి.