Read more!

English | Telugu

వైరల్ గా మారిన ఇంద్రజ తీన్ మార్ డాన్స్!

ఈటీవీలో ప్రసారమవుతున్న 'శ్రీ దేవి డ్రామా కంపెనీ' గురించి అందరికి తెలిసిన విషయమే.. దీనిని జడ్జ్ గా అలనాటి నటి ఇంద్రజ వ్యవహరిస్తుంది. హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ అప్పటికి.. ఇప్పటికి తరగని అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇంద్రజ చాలా రోజల క్రితమే తన ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మొదట జబర్దస్త్ కి జడ్జ్ గా చేసింది. ఆ తర్వాత చాలా ప్రోగ్రామ్స్ కి జడ్జి గా చేస్తోంది. మొదట్లో చిన్న చితక సీరియల్ లో మెరిసినా అంత గుర్తింపు ఏం రాలేదు.. ప్రస్తుతం సినిమాల్లో హీరో,  హీరోయిన్ లకి మదర్ రోల్ లో యాక్ట్ చేస్తూ మెప్పిస్తుంది ఇంద్రజ. కాగా తను ప్రస్తుతం జడ్జ్ గా చేస్తున్న షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. మల్టీ టాలెంట్ ని వెలికి తియ్యడంలో ఈ షో ఎప్పుడు ముందుంటుంది. ఈ షోకి సంబంధించిన తాజాగా విడుదలైన ప్రోమోలో ఇంద్రజ గారు తన డ్యాన్స్ తో ఆకట్టుకుంటుంది.

ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన 'దసరా' మూవీ లోని సాంగ్ కి వెన్నెల డాన్స్ ఎంత ట్రేండింగ్ క్రియేట్  చేస్తుందో అందరికి తెలిసిన విషయమే. ఆ సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ తో కీర్తి సురేష్ ని దింపేసింది ఇంద్రజ. ఊర మాస్ డాన్స్ తో స్టేజ్ ని షేక్ చేసింది ఇంద్రజ. ఎప్పుడు క్లాస్ గా కనిపించే ఇంద్రజ.. ఈ డాన్స్ లో పెళ్ళి కూతురి గెటప్ కాస్ట్యూమ్స్ అచ్చం కీర్తిసురేష్ లా డ్యాన్స్ చేసి షోని షేక్ చేసింది ఇంద్రజ. ఇప్పటికే  దసరా వెన్నెల డాన్స్ సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. అయితే ప్రస్తుతం ఇంద్రజ చేసిన ఈ వెన్నెల డాన్స్ ట్రెండింగ్ లో ఉంది. కాగా ఇంద్రజ డాన్స్ చూసిన నెటిజన్లు మాత్రం.. ఎనర్జీ లెవెల్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రోమోలోనే అదిరిపోయిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ షో పూర్తి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.