Read more!

English | Telugu

నువ్వు పూజకు పనికి రాని పువ్వు అన్న శ్రద్దా..అవాక్కైన జెస్సి

ఢీ షో ప్రతీ వారం మస్త్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. వచ్చే వారం షో మొత్తం కూడా డాన్స్ మాస్టర్స్ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఒక్కో డాన్స్ మాస్టర్ ఒక్కో రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి వావ్ అనిపించారు. చైతన్య మాస్టర్ స్టేజి మీదకు వచ్చి "సర్" మూవీ నుంచి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేసి అదరగొట్టాడు. మధ్యలో జడ్జి శ్రద్దా వచ్చి చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. చైతన్య మాస్టర్ ఎంతో పర్ఫెక్ట్ గా స్టెప్స్ వేయడంతో శేఖర్ మాస్టర్ కూడా ఇంప్రెస్ ఐపోయి "చైతన్య వచ్చాక నా కళ్ళు ఎటూ వెళ్ళలేదు అతని మీదే వున్నాయి" అని కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. ఈ సాంగ్ ఐపోయాక స్టేజి మీద  కాసేపు నవ్వులు పూయించడానికి జెస్సి, దివ్య వచ్చేసారు. "ఆవిడేంటి అంత వణుకుతోంది" అని ప్రదీప్ అడిగేసరికి "దివ్యకి బాగా చలేస్తోంది అంట" అన్నాడు జెస్సి.

మరి నువ్వేం చేస్తున్నావు జెస్సి అని శేఖర్ మాస్టర్ అడిగేసరికి "కొంచెం వెచ్చగా ఉంటుందని పక్కనే ఉన్నా" అన్నాడు జెస్సి.  "వెచ్చగా ఉండాలంటే ముందు మనలో వేడి ఉండాలి కదబ్బా" అని కౌంటర్ వేసాడు శేఖర్ మాస్టర్.  సర్లెండి మీరేదైనా అనుకోండి "ప్రదీప్ నువ్వు పొరపాటున మా ఇంటికి వచ్చిన సడెన్గా డోర్ తీసేయకు...ఒకవేళ నువ్వు అలా డోర్ తీస్తే అక్కడో సీన్ కనిపిస్తుంది..అని జెస్సి కొంచెం ఎక్స్ట్రా డైలాగ్ వేసేసరికి "ఏం కనిపిస్తుంది ..ఆరుగురు పతివ్రతల్లో ఒకాయన కూర్చుని ఏడుస్తూ ఉంటాడు కదా అలా కనిపిస్తావు" అని ప్రదీప్ సరదా కౌంటర్ వేసాడు. దాంతో జెస్సికి కోపం వచ్చి నా గురించి మీకు తెలీదు అని బిల్డప్ ఇచ్చేసరికి "నాకు తెలుసు ...నువ్వు పూజకు పనికిరాని పువ్వు" అని జడ్జి శ్రద్దా అనేసరికి అవాక్కయ్యాడు జెస్సి.

తర్వాత కుమార్ మాష్టర్ వచ్చి డాన్స్ చేసేసరికి "ఇదేం డాన్స్ అయ్యా కుమార్ మాష్టర్ ఇది నే సూడలా" అంటూ  కాంప్లిమెంట్ ఇచ్చింది శ్రద్దా. ఇలా కామెడీగా జరుగుతున్న ఈ షోలోకి సడెన్గా లేడీ గెటప్ లో వచ్చి షాకిచ్చాడు పండు...తన డాన్స్ తో అందరినీ డాన్స్ చేసేలా చేసాడు. శేఖర్ మాష్టర్ కూడా స్టేజి మీదకు వచ్చి పండుతో కలిసి స్టెప్పులేశాడు. "ఈ పెర్ఫార్మెన్స్ తో చితక్కొట్టేశారు, ఇచ్చిపడేశారు, చించిపడేశారు" అని ఒక రేంజ్ లో పండుని పొగిడేసింది శ్రద్దా...ఈ ఎపిసోడ్ 26 న ప్రసారం కాబోతోంది.