Read more!

English | Telugu

ఒంటిపై కిరోసిన్ పోసుకున్న స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -75 లో.. స్వప్నని చుసిన కనకం ఆవేశంతో తిడుతుంది. ఏ మొహం పెట్టుకొని వచ్చావే.. నువ్వు ఎప్పుడో చచ్చావే.. మళ్ళీ ఎందుకు వచ్చావ్.. నువ్వు రాగానే కన్నా ప్రేమ కరిగిపోతుందనుకున్నావా? నువ్వు చేసిన పనికి నీపై ఉన్న ప్రేమ చచ్చిపోయింది. ఇక్కడ నుండి వెళ్ళమని స్వప్నతో కనకం అంటుంది. ఇంతలో కృష్ణమూర్తి గదిలో నుండి వచ్చి.. దీన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారంటూ.. స్వప్న మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. నాన్న అని స్వప్న అనగానే.. అలా పిలవకు.. నీతో నాన్న అని పిలిపించుకోవడం కంటే... నాకు ఇద్దరే కూతుర్లు అని చెప్పాడంలో నాకు గౌరవం ఒక గౌరవంగా ఉంటుందని కృష్ణమూర్తి అంటాడు.

ఇక స్వప్న తన నటన మొదలు పెట్టి.. అమ్మ నువ్వయినా నాన్నకి చెప్పమ్మా.. ఎవరు లేని దానిలా రోడ్డు మీద తిరుగుతుంటే.. మీకు బాగుంటుందా అమ్మ అని స్వప్న అనగానే.. నేను నా భర్త మాటే వింటాను.. ఇప్పటికే నేను నా భర్త మాట పెడచెవిన పెట్టి తప్పు చేసానని కనకం అంటుంది ఇప్పటికే నీ వల్ల ఆయనను బాధ పెట్టాను. నిన్ను ఉండమని చెప్పి ఆయన్ని బాధపెట్టలేనని కనకం అంటుంది. ఇక అప్పు కూడా స్వప్నకి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.. ఇంట్లో పెళ్ళయినా కూతురు అల్లుడు ఉన్నారు. నీలాంటి దాన్ని ఉండనిస్తే నా కూతురు కూడా తనని వదిలేసి వెళ్తాడని కనకం అంటుంది. ఇక స్వప్న ఒంటిపై  కిరోసిన్ పోసుకుని అందరిని బెదిరిస్తుంది. కావ్య లాక్కొని ఆపుతుంది. నాన్న మీకేమైన పిచ్చిపట్టిందా.. కన్నా కూతురు ని చంపుకుంటారా.. అది తప్పు చేసానని ఒప్పుకుంటుంది కదా దాన్ని ఎవరో ట్రాప్ చేశారంటూ స్వప్నని ఇంట్లోకి రావడనికి ఒప్పిస్తుంది. కాసేపటికి స్వప్న సూట్ కేసుని విసిరేస్తుంది అప్పు. ఆ సూట్ కేస్ మీద R అనే అక్షరం గల గ్రీటింగ్ కింద పడుతుంది.‌‌ అది చూసిన కావ్య.. R ఎవరని ఆలోచిస్తుంటుంది. మొన్న ఫంక్షన్ లో స్వప్న కన్పించినప్పుడు రాహుల్ నన్ను డైవర్ట్ చేసాడని.. తనపై డౌట్ పడుతుంది కావ్య.. ఇలా దీన్ని చూపిస్తే రాజ్ నమ్మడు సాక్ష్యాలు చూపించాలని అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ వెళ్తానని బయలుదేరుతుండగా.. కావ్య అడ్డుకుంటుంది. నువ్వు నన్ను ఆపలేవని అడ్డుగా ఉన్న కావ్యని తోసేస్తాడు రాజ్. అప్పుడు కావ్య తలకి దెబ్బ తాకుతుంది. మీరు మా అక్క చెప్పినవి నిజమని నమ్మకండి.. అవి నిజాలు కాదని నిరూపించడానికి నాకు వారం రోజులు టైం ఇవ్వండి.. నేను మా అక్కని ట్రాప్ చేసింది ఎవరో తెలుసుకుంటానని కావ్య అనగానే.. సరేనని రాజ్ ఒప్పుకుంటాడు.

మరోవైపు స్వప్నతో అప్పు గొడవ పెట్టుకుంటుంది. లేచిపోయిందానివి.. నీకు  ఈ ఇంట్లో స్పెషల్ గా గది ఉంటుందా?  సక్కగా నా రూమ్ లో కిందపడుకోమని అప్పు అంటుంది. స్వప్న కొద్దిసేపు వాదించి వేరే దారి లేక అప్పు గదిలోకి వెళ్లి పడుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.