English | Telugu
గౌతమ్ పెళ్ళి తనకు నచ్చిన అమ్మాయితో జరుగుతుందా?
Updated : Apr 21, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -136 లో.. కృష్ణపై నుండి కిందకి వస్తుంది. ఇక అంత హాల్లో ఉండడం చూసి.. ఏసీపీ సర్ కి నేను నిజం చెప్పినట్లు తెలియకుండా మాట్లాడాలని కృష్ణ అనుకుంటుంది. సర్ ఏంటి అలా ఉన్నారు.. ఏదో చెయ్యకూడనిది చేస్తున్నట్లని కృష్ణ అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న ముకుంద.. నువ్వు కాలేజీకి వెళ్ళు.. మురారికి పెద్ద అత్తయ్య గారు ఒక పని అప్పజెప్పారు.. నువ్వేమైనా చిన్న పిల్లవా కాలేజీ కి ఒక్కదానివి వెళ్లలేవా అంటుంది. వెళ్తాను మీ పనికి మీరు వెళ్ళండి.. నా పనికి నేను వెళ్తాను.. ఎవరి పని ముందు అవుతుందో చూడాలని అంటుంది కృష్ణ. ఆ తర్వాత భవాని దగ్గరికి వెళ్ళిన కృష్ణ.. అత్తయ్య నన్ను ఆశీర్వదించండి.. ఈ రోజు నేను ఆపరేషన్ పూర్తి చేస్తున్న అని చెప్పి తన ఆశీర్వాదం తీసుకుంటుంది. సర్ బయట వరకు నాతో రండని చెప్పి మురారిని తీసుకువెళ్తుంది కృష్ణ. ఇక కృష్ణ, మురార ఇద్దరు బయటకు వెళ్లగానే.. ఈ తింగరి పిల్లకి నిజం ఏమైనా తెలిసిందా అని భవాని అనగానే.. లేదు వదిన తెలిస్తే కృష్ణ అసలు ఇలా ఉండేది కాదని ఈశ్వర్ అంటాడు.
ఆ తర్వాత గౌతమ్ , తన ఫ్రెండ్ బాలుతో ఉండి ఇద్దరు మాట్లాడుకుంటారు. కృష్ణ, నందుని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది.. ఇంకా రాలేదేంటి.. నాకు టెన్షన్ గా ఉందని గౌతమ్ చెప్పగా.. కృష్ణకి ఇంట్లో సిట్యుయేషన్ ఎలా ఉందో అని బాలు అంటాడు. గౌతమ్ మాత్రం పెళ్లి జరుగుతుందో లేదోనని టెన్షన్ పడుతాడు. మరోవైపు ముకుంద మురారి పెళ్లి మండపానికి బయలుదేరతారు. వాళ్ళ కార్ ని ఫాలో అవుతూ కృష్ణ ఆటో లో వెళ్తుంది. ఇక ఓక టర్నింగ్ దగ్గర ముకుంద మురారిల కార్ వెళ్ళిపోతుంది. ఇక ఆటో అతను ఆ కార్ కన్పించడం లేదని ఆపేస్తాడు. కృష్ణ టెన్షన్ పడుతూ.. గౌతమ్ దగ్గరికి వెళ్తుంది.. ఏంటి కృష్ణ ఒక్క దానివే వచ్చావ్? ఏసీపీ సార్ ఎక్కడ అని అడుగుతాడు. భవాని అత్తయ్య నందుకి ఈరోజు పెళ్లి చెయ్యబోతుందని కృష్ణ చెప్పగానే.. ఇక అంతా అయిపోయిందంటూ గౌతమ్ బాధపడతాడు. మీరు టెన్షన్ పడకండి. నేను ఎలాగైనా మీ పెళ్లి చేస్తానని కాన్ఫిడెంట్ గా కృష్ణ చెప్తుంది.
మరోవైపు మురారి ఒక్కడే కూర్చొని కృష్ణకి ఇచ్చిన మాట కోసం ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత మురారి, ముకుందలు పెళ్లి మండపంకి చేరుకుంటారు. అక్కడ నందు కన్పించకపోవడంతో.. ఏంటి నందు ఎక్కడ ఉందని ముకుందని మురారి అడుగుతాడు. నాకేం తెలియదని ముకుంద అంటుంది. మీ పెద్దమ్మ నీతో కలిసి పెళ్లి ఏర్పాట్లు చెయ్యమంది.. అదే నాకు సంతోషం.. ఇంకేం అవసరం లేదని ముకుంద అంటుంది. ఇంతలో భవాని వాళ్ళు కల్యాణ మండపంకి చేరుకుంటారు. వాళ్ళు రాగానే పెద్దమ్మ నందు ఎక్కడ అని భవానిని మురారి అడుగుతాడు. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. ముహూర్తం టైమ్ కి రెడీ చేసి తీసుకొస్తుందని భవాని అంటుంది. పెళ్లి కొడుకు వాళ్ళ ఏర్పాట్లు నువ్వు చూసుకో.. ఆ బాధ్యత నీదే అని మురారితో భవాని అంటుంది. కృష్ణ నందు పెళ్లి ఆపుతుందా? గౌతమ్ కి ఇచ్చిన మాట నెరవేరుస్తుందా? లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.