Read more!

English | Telugu

వాళ్ళిద్దరి పెళ్ళి కోసం కృష్ణ ఒంటరి పోరాటం.. డల్ గా మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -137 లో.. నందుతో తన పెళ్లి కాదేమోనని గౌతమ్ టెన్షన్ పడుతుంటే.. నీ పెళ్లి నేను చేస్తాను.. ఇప్పుడు పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడం తెలా అని ఆలోచిస్తూ.. మురారికి ఫోన్ చేసి, వాయిస్ మార్చి మాట్లాడుతుంది కృష్ణ. "నేను మీ డీజీపీని మాట్లాడుతున్నాను. మీ చెల్లి పెళ్లి చేస్తున్నావ్ అంట కదా.. కనీసం నాకు చెప్పలేదు" అనేసరికి మురారి గుర్తుపట్టి స్టాపిట్ కృష్ణ అని అనగానే.. కృష్ణ ఫోన్ కట్ చేసి ఏసీపీ సర్ నన్నిలా గుర్తుపట్టాడేంటని అనుకుంటుంది. 

ఆ తర్వాత భవాని అత్తయ్యకి ఈ ఊళ్ళో ఎవరైనా తెలిసినవాళ్ళు ఉన్నారా అని గౌతమ్ ని అడుగుతుంది కృష్ణ. తన ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ లో ఉంటారని గౌతమ్ అంటాడు. ముకుంద వాళ్ళ అమ్మనాన్నల దగ్గర నందు ఉందేమోనని కృష్ణ అంటుంది. వెంటనే గౌతమ్, కృష్ణలు బయల్దేరుతారు. కృష్ణ జ్యువలరీ షాప్ దగ్గర ఆగి.. తాళిబొట్టుని కొంటుంది. ఒక వేళ నందు అక్కడ ఉంటే.. ఈ తాళిని నందు మెడలో కట్టు అని గౌతమ్ కి చెప్తుంది. ఆ తర్వాత ముకుంద వాళ్ళ ఇంటికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఏం చేయాలి.. ఎలాగైనా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలని కృష్ణ అంటుంది. మరోవైపు పెళ్లి పనులు జరుగుతుంటాయి. మురారి మాత్రం డల్ గా కన్పించడంతో.. ఈశ్వర్, ప్రసాద్ లు మురారి చేతులు మీదుగా ఈ పెళ్లి జరుగుతున్నట్లు లేదు.. డల్ గా ఉన్నాడు అని అంటారు. ఎవరికీ తెలియకుండా ఈ పెళ్లి చేస్తున్నామని బాధలో ఉన్నాడేమోనని భవాని అంటుంది. మరోవైపు కృష్ణ పెళ్లి మండపం అడ్రస్ కనుక్కోవాలని.. వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయిన ఒక పోలీస్ కి ఫోన్ చేసి ఒక నెంబర్ చెప్తాను లొకేషన్ ఎక్కడ ఉందో సిగ్నల్  ట్రేస్ చేసి చెప్పండని కృష్ణ చెప్తుంది. అతను సరేనంటాడు. మురారిని ఇబ్బంది పెడుతున్నామేమో అని గౌతమ్ అనగానే.. అదేం కాదు చీకట్లో ఒక వెలుగు కోసం ప్రయతిస్తున్నామని కృష్ణ  అంటుంది

మరోవైపు నందుని పెళ్లికూతురు లాగా రెడీ చేసి అలేఖ్య తీసుకొని వస్తుంది. నందుని పెళ్లి కూతురిలా చూసిన భవాని ఎమోషనల్ అవుతుంది. నందు మాత్రం సిద్దు వచ్చాడా అని అడిగేసరికి భవాని కోప్పడుతుంది. నందుని అలా చూసేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మురారి మాత్రం సైలెంట్ ఉండి కృష్ణ గురించి ఆలోచిస్తాడు. మరోవైపు గౌతమ్ తో మాట్లాడుతుంటుంది కృష్ణ. నీ పెళ్లి నందుతో  జరుగుతుందని అంటుండగా.. అంతలోనే అక్కడికి వచ్చిన రేవతి.. మరి నీ జీవితం ఏం కావాలని అంటుంది. మరి కృష్ణ.. నందు, గౌతమ్ లను ఒకటి చేసి వాళ్ళ ప్రేమని బ్రతికించనుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.