ప్లాస్టిక్ ని కాదు.. నైటీలని బ్యాన్ చేయండని చెప్పిన హైపర్ ఆది!
ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఈ షోకి యాంకర్ గా రష్మీ చేస్తుండగా.. నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుధీర్, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, వర్ష, ఇమ్మాన్యుయెల్ ఇంకా కొంతమంది కామెడియన్స్ తమ కామెడీతో అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుండగా.. ఈ షో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న షోగా 'శ్రీ దేవి డ్రామా కంపెనీ' పేరు తెచ్చుకుంది.