English | Telugu

మీరు ఇక నా ముక్కుని చూడడం ఆపేయండి.. దీప్తి వార్నింగ్!

సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యాక ప్రతీ ఒక్కరూ స్టార్స్ ఐపోతున్నారు. అలాంటి కొంతమందిలో దీప్తి సునైనా, షన్ను కూడా ఒకరు. వీళ్ళు సోషల్ మీడియాలో వెబ్ సిరీస్, డబ్ స్మాష్, ఇన్స్టా రీల్స్ తో ఫుల్ పాపులర్ అయ్యారు. కానీ షన్ను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాక ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది. ఎవరి దారి వారు చూసుకుని లైఫ్ లీడ్ చేస్తున్నారు. దీప్తి ఇప్పుడు ఇన్స్టాలో తన స్టేటస్ లో "ఆస్క్ మీ ఏ క్వశ్చన్ " అంటూ తన ఫాన్స్ ని అడిగింది. అలా అడగడమే ఆలస్యం ఎవరైనా ఊరుకుంటారా "అక్కోయ్...బయటికి ఏదో మేనేజ్ చేస్తాం కానీ ..ఇన్సైడ్ ఎలా ఉన్నారు ? బానే ఉన్నారా ? హౌ ఆర్ యు ?" అని ఒక నెటిజన్ అడిగేసరికి "ఇన్సైడ్-అవుట్ సైడ్ ఏమిటి.. నేను హ్యాపీగానే ఉన్నా" అంటూ చెప్పింది.

ఇంకో కొంటె నెటిజన్ ఒక వెరైటీ ప్రశ్న వేసాడు "అక్కా నేను కొత్త టి-షర్ట్ కొనుక్కున్నా.. ముందు ఏ చేయి పెట్టమంటావ్..రైటా , లెఫ్ట్ ఆ ? అని అడిగేసరికి "ఏం ప్రశ్నరా బాబు ఇది" అన్నట్టుగా కళ్ళు మూసుకుని తల పట్టుకుని కూర్చుంది. "ఎవరైనా మనల్ని మెంటల్ గా ఫిజికల్ గా బాధ పెట్టినప్పుడు రివెంజ్ తీర్చుకోవాలా, క్షమించి వదిలేయాలా? అని అడిగేసరికి "మర్చిపో" అని ఆన్సర్ చేసింది. "ఏదైనా ఒక పాట పాడవా దీపు ?" అని అడిగేసరికి "గైస్...మీరు ఇక నా ముక్కుని చూడడం ఆపేయండి" అంటూ కొంటెగా జవాబిచ్చింది. ఇక దీప్తి అటు బుల్లితెర, ఇటు వెండితెరపై అవకాశాలను దక్కించుకోవడానికి తెగ ట్రై చేస్తోంది. అయితే, చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. స్పీడ్ పెంచుతూ వరుసగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ఫాన్స్ ని అలరిస్తోంది. ఎన్నో కవర్ సాంగ్స్ తో అలరించిన దీప్తి సునైనా తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.