English | Telugu

Ayesha Zeenath Wildcard Entry: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అయేషా.. తనకిచ్చిన పవర్ ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటి ఎపిసోడ్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలతో పవర్ ప్యాక్ గా మారింది. ఒక్కో కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తుంటే ఇప్పటివరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చెమటలు పడుతున్నాయి. అంతలా భయపెట్టిన వారిలో అయేషా జీనత్ ఒకరు.

సీరియల్ హీరోయిన్ గా, మోడల్ గా చేసిన అయేషా జీనత్ వైల్‌కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోకి అయిదవ వైల్డ్‌కార్డ్‌గా అయేషా వచ్చింది. సూపర్ పర్ఫామెన్స్‌తో హౌస్‌లోకి వచ్చిన అయేషాని చూసి నాగార్జున అయితే ఫిదా అయిపోయాడు. ముఖ్యంగా ఆమె ఎనర్జీ మాములుగా లేదు. తెలుగు కూడా చాలాా బాగా మాట్లాడుతుంది. అయేషా నువ్వు రౌడీ బేబీ అంట కదా అని నాగార్జున అడిగాడు. అవును సర్ చాలా అంటూ అయేషా చెప్పింది. ఇక మరి ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నావ్.. చాలా అందంగా ఉన్నావ్.. మరి ప్రపోజల్స్, లవ్ సంగతేంటని నాగర్జున అడుగగా.. చాలా సార్లు ప్రేమలో పడ్డాను సర్.. ముఖ్యంగా తమిళ్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు అని అంది. నాకు బయట ఒక లవ్ ఉండేది. తన గురించి ఆలోచిస్తూ నేను గేమ్స్ సరిగ్గా ఆడలేకపోయాను.. మొత్తం 65 రోజులు హౌస్‌లో ఉన్నా, తీరా బయటికి వచ్చేసరికి వాడు మరొక అమ్మాయితో సెట్ అయిపోయాడు. అప్పటి నుంచి ప్రేమకి దూరంగా ఉన్నాను ఈసారి కప్పే లక్ష్యంగా హౌస్‌లోకి వెళ్లబోతున్నానంటూ అయేషా చెప్పింది.

ఇక ప్రతీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీకి ఇచ్చినట్లే అయేషాకి ఒక పవర్ ఇచ్చాడు. దాని పేరే నామినేషన్ పవర్.. దీని కోసం ఆమెకి గ్రీన్ స్టోన్ ఇచ్చాడు నాగార్జున. ఈ పవర్ సాయంతో నామినేషన్ జరిగే ప్రక్రియని మార్చొచ్చు.. అది ఎలా అనేది బిగ్‌బాస్ చెప్తారంటూ నాగార్జున చెప్పాడు. ఇక అయేషా లోపలికి వెళ్లే ముందు తనకి నాగార్జున చిన్న టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఎవరో ఒక అబ్బాయికి హార్ట్ సింబల్ ఇవ్వాలన్నాడు. అయేషా ఆ హార్ట్ సింబల్‌ని తీసుకెళ్ళి ఇమ్మాన్యుయల్ కి ఇచ్చింది. ఇక లోపలికి వెళ్ళిన అయేషా అందరిని పరిచయం చేసుకుంది. ఇక హౌస్ లోకి ఆరుగురు వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.