English | Telugu
సుమిత్ర కూతురికి టెస్టులు చేయాలన్న డాక్టర్.. జ్యోత్స్న పరిస్థితి ఏంటి?
Updated : Jan 17, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -570 లో.....సుమిత్రకి క్యాన్సర్ అని జ్యోత్స్న చెప్పగానే సుమిత్ర కుప్పకూలిపోతుంది. అందరు షాక్ అవుతారు. నా కూతురు జ్యోత్స్న కాబట్టి నాపై ఒట్టేసి నిజం చెప్పు అనగానే నిజం చెప్పింది. నువ్వు నా కూతురివి కాదు కదా.. నువ్వు ఎందుకు నిజం చెప్తావని దీపతో సుమిత్ర అంటుంది. నేనే అమ్మ నీ కన్నకూతురిని అని దీప మనసులో అనుకుంటుంది. సుమిత్రకి తనకి ఉన్న వ్యాధి తెలిసి బాధపడుతుంది.
మరొకవైపు స్వప్నకి కాశీ ఫోన్ చేసి.. నువ్వు వచ్చేయ్ ఇద్దరం సపరేట్ ఉందాం.. వేరే ఇల్లు తీసుకొని అని కాశీ అనగానే నేను రాను నీతోనే ఉండనని స్వప్న అంటుంది. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నా వినకుండా స్వప్న ఫోన్ కట్ చేస్తుంది. ఎంత పొగరు అని కాశీ అనుకుంటాడు. మరొకవైపు సుమిత్ర దగ్గరికి డాక్టర్ వచ్చి.. మీరు ఇప్పుడు ధైర్యంగా ఉండాలని చెప్తుంది. మిమ్మల్ని ఇప్పుడు కాపాడేది మీ కూతురే అని డాక్టర్ చెప్తుంది కానీ ఇప్పుడు జ్యోత్స్నకి కొన్ని టెస్ట్ లు చెయ్యాలని చెప్తుంది. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. జ్యోత్స్నని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళమని కార్తీక్ కి దశరథ్ చెప్తాడు. నీకు అమ్మగా జన్మనిచ్చాను.. నువ్వు ఇప్పుడు నాకు పునర్జన్మనిస్తున్నావని జ్యోత్స్నతో సుమిత్ర అంటుంది. ఆ దీప మీకు సొంతకూతురు అయినట్లు మీ గురించి ఏడుస్తూనే ఉందని డాక్టర్ అనగానే తను మాకేం కాదు.. మా కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వరుసకి కూతురు అవుతుందని సుమిత్ర అంటుంది.
అ తర్వాత ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు నిజం తెలిసిపోతుందేమోనని భయం వేస్తుందని పారిజాతం, జ్యోత్స్న అనుకుంటారు. అప్పుడే దీప వచ్చి బావ మీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నారని అంటుంది. మరొకవైపు శివన్నారాయణకి కాంచన ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.