English | Telugu

అమ్మమ్మను చివరి చూపు కూడా చూసుకోలేకపోయా...

అమ్మమ్మను చివరి చూపు కూడా చూసుకోలేకపోయా...

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం అమ్మమ్మగారింట్లో అంటూ టెలికాస్ట్ అయ్యింది. అసలే పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి అమ్మమ్మగారింటికో నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళిపోయి సమ్మర్ హాలిడేస్ ని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ వారం బుల్లితెర నటీనటుల్ని ఈ షోకి వచ్చారు. ఇక సీనియర్ నటి అన్నపూర్ణ కూడా వచ్చింది. గేమ్స్, టాస్కులు ఆడిన తర్వాత అందరూ రౌండ్ గా కూర్చుంటే అన్నపూర్ణమ్మ పెద్ద బేసిన్ లో ఆవకాయ అన్నం కలిపి అందరికీ ముద్దలు కలిపి పెట్టింది. ఈ నోస్టాల్జియా మెమోరీస్ అమ్మమ్మతో ఎక్కువగా ఉంటాయి. దాంతో షోలో వాళ్ళ వాళ్ళ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో ఎలా గడిచాయో చెప్పారు.

ఇద్దరి ఆడవాళ్ళ మధ్య బిందెల ఫైట్...

ఇద్దరి ఆడవాళ్ళ మధ్య బిందెల ఫైట్...

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ కి ఇద్దరు ఘనాపాఠీలు ఎంట్రీ ఇచ్చారు. అది కూడా స్టేజి దగ్గరకు కార్ లో వచ్చి డోర్ తీసుకుని అలా స్టేజి మీదకు నడిచొచ్చారు. "ఎండా కాలంలో ఏదైనా మంచు ప్రదేశానికి వెళదాం అనుకున్నా ఇక్కడికి వచ్చేసారు" అంటూ మంచు లక్ష్మిని చూపించింది రోజా. "పోటీలో ఎవరైనా కంచుగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను..మీరు కలిశారు" అని మంచు లక్ష్మి రోజా మీద సెటైర్ వేసింది. తర్వాత ఇద్దరూ షాక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. తర్వాత ఇద్దరితో రవి కొంచెం టఫ్ గేమ్స్ ఆడించాడు. స్టేజి మీద బోరింగ్ పంప్ పెట్టించి నీళ్లు కొట్టించాడు ఇద్దరి చేతా. "నాకు మంచు లక్ష్మికి పోటీ పెట్టారు.

చిన్న డ్రాయర్ తో, బనీన్ తో ఉంటాడు...కుదిరితే నా ఆయుష్షు కూడా పోసుకుని...

చిన్న డ్రాయర్ తో, బనీన్ తో ఉంటాడు...కుదిరితే నా ఆయుష్షు కూడా పోసుకుని...

"మన రూపం చూడకముందే, మన గొంతు వినకముందే, మనల్ని మనలా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ" అలాంటి మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇక ఫామిలీ స్టార్స్ షో ఈ వారం మదర్స్ డే స్పెషల్ ఈవెంట్ తో రాబోతోంది. ఈ షోకి మానస్, రాకేష్, విశ్వా ఇంకా మిగతా బుల్లితెర నటులు అంతా వాళ్ళ వాళ్ళ మదర్స్ తో వచ్చారు. హోస్ట్ సుధీర్ మానస్ వాళ్ళ అమ్మను ఒక ప్రశ్న అడిగాడు "మానస్ ఇంట్లో ఎలా ఉంటాడండి" అని అడిగేసరికి "చిన్న డ్రాయర్ తో చిన్న బనీన్ తో అలా కనిపిస్తూ ఉంటాడు" అని చెప్పేసరికి మానస్ ఊరుకోమ్మా ఇంట్లో విషయాలన్నీ స్టేజి మీద పరువు పోయేలా చెప్తావేంటి అన్నట్టు పెట్టాడు ఫేస్. తర్వాత రాకేష్ దగ్గరకు వచ్చి చిన్నప్పటినుంచి ఇలాగే ఉండేవాడా అని వాళ్ళ అమ్మను అడిగితే "చిన్నప్పుడు అంటే ఒకటి గుర్తొచ్చింది..చిన్నప్పుడు ఉంగా ఉంగా అనేవాడు" అని చెప్పేసరికి సుధీర్ షాకయ్యాడు.

ఇమ్మ్యూనిటి లెవెల్స్ తగ్గిపోయాయి.. ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయింది...

ఇమ్మ్యూనిటి లెవెల్స్ తగ్గిపోయాయి.. ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయింది...

నటి మాధవి లతా కొంతకాలం క్రితం వరకు మూవీస్ లో చేస్తూ ఉండేది. కానీ మూవీస్ కి బైబై చెప్పేసి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే సోషaల్ ఇష్యూస్ మీద తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు, వీడియోలు పెడుతూ ఉంటుంది. ప్రతీ ఇష్యూ మీద ఆమె స్పందిస్తూ ఉంటుంది. అలాంటి మాధవి లతాకి ఆరోగ్యం బాగాలేక వీడియోస్ చేయడం లేదు. ఐతే రీసెంట్ గా తన హెల్త్ అప్డేట్ మీద ఒక వీడియోని చేసి పోస్ట్ చేసింది. "రెండేళ్ల నుంచి హెల్త్ అసలు సహకరించడం లేదు. బాగా మైగ్రేన్ ఉంది. దాంతో సరిగా నిద్ర పట్టడం లేదు. ఆ కారణంగా ఇమ్మ్యూనిటి పవర్ తగ్గుతోంది..అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ బాగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ పది నిమిషాలు కూడా నడవలేకపోతున్న.. అసలు అడుగు తీసి అడుగు వేయాలంటే భయం వేస్తోంది. మెంటల్లీ నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటా కానీ ఫిజికల్లీ చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేను. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల హెల్త్ చాలా డెలికేట్ గా ఉంటుంది.  

కాన్సర్ తో అమ్మ చనిపోయింది..కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ

కాన్సర్ తో అమ్మ చనిపోయింది..కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ

తేజస్విని మడివాడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన తేజస్వి తర్వాత ఎన్నో మంచి మూవీస్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళింది. కానీ హౌస్ నుంచి వచ్చాక ఆమె మీద ఫుల్ నెగటివిటీ రావడంతో మూవీస్ లో కనిపించడం మానేసింది. ఐతే ఇప్పుడు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర మీద కొన్ని షోస్ లో కనిపిస్తోంది. అదే కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లో యాక్టీవ్ పార్టిసిపెంట్ గా ఉంది. కానీ ఈ వారం ఫ్యామిలీ  థీమ్ లో ఆమె తన స్టోరీ చెప్పి అందరితో కన్నీళ్లు పెట్టించేసింది. జడ్జ్ అనసూయ కూడా కన్నీళ్లు పెట్టేసుకుంది. తనకు ఫుడ్ పెడుతున్న ఒక ఫ్యామిలీ  నుంచి రోహిత్ భరద్వాజ్ అనే పర్సన్ ని షోలో పరిచయం చేసింది. అప్పుడు తన ఫామిలీ గురించి చెప్పింది.

Illu illalu pillalu : భాగ్యం ప్లాన్ కి చెక్ పెట్టిన ప్రేమ.. కళ్ళుతిరిగిపడిపోయిన రామరాజు కోడలు!

Illu illalu pillalu : భాగ్యం ప్లాన్ కి చెక్ పెట్టిన ప్రేమ.. కళ్ళుతిరిగిపడిపోయిన రామరాజు కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -150 లో.. వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. పాపం ఇలా పదహారు రోజుల పండుగ చేసుకోలేదని ప్రేమ, నర్మద బాధపడేలా చేస్తుంది భాగ్యం. ఆ తర్వాత శ్రీవల్లి మెడలో తాళి వేస్తాడు చందు. భాగ్యం పక్కకి తీసుకొని వచ్చి శ్రీవల్లి నగలన్ని తీసుకుంటుంది. చందు, శ్రీవల్లీలతో పాటు అందరు భాగ్యం ఇంటినుండి బయల్దేర్తుంటారు. అక్క నువ్వు వచ్చేటప్పుడు అన్ని నగలు వేసుకొని వచ్చావ్ మరి ఇప్పుడేంటి ఏం నగలు లేవని ప్రేమ అంటుంది.