English | Telugu
అమూల్య ఎంగేజ్ మెంట్ చెడగొట్టడానికి భాగ్యం ప్లాన్
Updated : Jan 17, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -371 లో.. ఎప్పటిలాగే ప్రేమ, ధీరజ్ గొడవపడుతుంటారు. ప్రేమ తన చేతిలో పూలప్లేట్స్ పట్టుకొని వస్తుంటే అవి పడిపోతుంటాయి. వెంటనే ధీరజ్ పట్టుకుంటాడు. మీ చిన్న అబ్బాయికి తన భార్య అంటే చాలా ఇష్టం అనుకుంటా అని అబ్బాయి వాళ్ల అమ్మ వనజ అంటుంది. అవును ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా అని రామరాజు అంటాడు. శ్రీవల్లి, భాగ్యం కలిసి అమూల్య ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తారు. అమూల్య, విశ్వ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోస్ అబ్బాయికి కనిపించేలా పెట్టడానికి ట్రై చేస్తారు.
అ తర్వాత శ్రీవల్లి గదిలో ఫొటోస్ పెట్టాలని ట్రై చేస్తుంది. బయట భాగ్యం కాపలా ఉంటుంది. శ్రీవల్లి లోపలికి వెళ్ళగానే నర్మద వెళ్తుంది. దాంతో శ్రీవల్లి బెడ్ కింద దాక్కుంటుంది. నర్మదకి డౌట్ వస్తుంది. బెడ్ కింద చూసేసరికి బెడ్ పైకి ఎక్కుతుంది శ్రీవల్లి. అలా నర్మదకి కన్పించకుండా శ్రీవల్లి తప్పించుకుంటుంది. ఆ తర్వాత కాసేపటికి ప్రేమ ఏదో అవసరం ఉంటే అదే గదిలోకి వస్తుంది. ప్రేమకి డౌట్ వస్తుంది కానీ అప్పుడు కూడా శ్రీవల్లి తప్పించుకుంటుంది. అమ్మడు అందరు వెళ్లిపోయారురా అని భాగ్యం అంటుండగా.. మళ్ళీ కామాక్షి బ్యాగ్ తో గదిలోకి వస్తుంది.
పుట్టింట్లో తనకి నచ్చినవన్నీ బ్యాగ్ లో సర్దుతుంది కామాక్షి. అ బ్యాగ్ ని బెడ్ కిందకి తోసేయగా... అది శ్రీవల్లికి గట్టిగా తగులుతుంది. ఆ తర్వాత శ్రీవల్లి మెల్లిగా బయటకు వచ్చి.. నీ ఐడియా చెత్తలాగా ఉంది. ఈ ఫొటోస్ నువ్వే పెట్టుకోమని భాగ్యంతో చెప్పి శ్రీవల్లి వెళ్ళిపోతుంది. మరొకవైపు శ్రీవల్లి ఏంటి కన్పించడం లేదని ప్రేమ, నర్మద మాట్లాడుకుంటారు. ఇందాక గది బయట వాళ్ల అమ్మ, తను టెన్షన్ పడుతూ కన్పించిందని నర్మద, ప్రేమ మాట్లాడకుంటారు. ఆ తర్వాత అమూల్యని హాల్లోకి పిలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.