English | Telugu
Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!
Updated : Jan 17, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.
మరోవైపు కావ్య దగ్గరికి దుగ్గిరాల కుటుంబమంతా వస్తారు. రాజ్ వచ్చి సంతోషంగా చూస్తాడు. ఇంటికి వారసురాలు వచ్చినంత ఆనందంలో అందరు హ్యాపీగా ఉంటే రాహుల్ డిస్సప్పాయింట్ గా ఉంటాడు. అప్పుడే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి రాజ్ ని తీసుకెళ్ళాలని అంటారు. సరే పదా వెళ్దామని రాజ్ అనగానే.. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదని అప్పు ఎంట్రీ ఇస్తుంది. రాజ్ ఏం తప్పు చేయలేదు.. ఆ సాండీ తప్పు చేశానని ఒప్పుకున్నాడని, రాజ్ ఏం తప్పు చేయలేదని కోర్ట్ లెటర్ ఇచ్చిందని అప్పు అనగానే.. కానిస్టేబుల్స్ ఆ లెటర్ చూసి రాజ్ ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అప్పుని అందరు అభినందిస్తారు. నా కోడలు గ్రేట్ అంటూ అప్పుని ధాన్యలక్ష్మి అంటుంది. ఇక అందరు సంతోషంగా ఉంటారు.
మరోవైపు మినిస్టర్ టెన్షన్ పడుతుంటే అతని దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. మీ సిచువేషన్ నాకు అర్థం అయింది. మీ భార్య మెలుకవలోకి వచ్చేలోపు.. మీ పాప స్థానంలో వేరే వాళ్ళ పాపని ఉంచాలని రుద్రాణి చెప్తుంది. మీలాగా కన్నింగ్ ఆలోచన నేను చేయనని రుద్రాణిపై మినిస్టర్ కోప్పడతాడు. నా పాపని నేను కాపాడుకుంటానని మినిస్టర్ కోపంగా వెళ్ళిపోతుంటే తన పర్సనల్ కార్డ్ ఇచ్చి. ఒకవేళ మీరు సక్సెస్ అయితే కాల్ చేయండి లేదంటే నా ప్లాన్ ప్రకారం చేద్దామని చెప్తుంది. దాంతో రుద్రాణి ఇచ్చిన కార్డ్ తీసుకుంటాడు మినిస్టర్. మరోవైపు రాజ్, కావ్య ప్రేమగా మాట్లాడుకుంటారు. పాప పుట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డామో అని తనలో ఏదో తెలియని అలజడి ఉందని కావ్య అనగానే ఏం టెన్షన్ పడకు అని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.