English | Telugu
మరదలు ఆలియా గురించి చెప్పిన కరీనా!
Updated : Aug 22, 2023
కరీనాకపూర్ ఖాన్, ఆలియా భట్ కపూర్ పొటెన్షియల్ కొలాబరేషన్ గురించి ఇంట్రస్టింగ్ చర్చ జరుగుతోంది బీటౌన్‌లో. ఆలియా ఇటీవల కరీనాతో ఉన్న ఫొటోలు షేర్ చేసుకున్నారు. అసలు వీరిద్దరు కలిసి ఆ ఫొటోలు ఎందుకు తీసుకున్నారంటూ జనాలు ఆశ్చర్యపోయారు. ఈ ఫొటోల గురించే రీసెంట్‌గా ఓపెన్ అయ్యారు కరీనా. కరీనా మాట్లాడుతూ ``ఆలియాతో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఎవరైనా దర్శకులు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తెస్తే చేద్దామని అనుకున్నాం. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. మన దగ్గర ఎంతో మంది గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు మంచి స్క్రిప్ట్ తో వచ్చినా సినిమా చేయడానికి నేను రెడీ. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్ముతాను నేను. అందుకే స్క్రిప్ట్ గురించి ఇంతలా మాట్లాడుతున్నాను. అలా కాకుండా జస్ట్ కలిసి చేద్దామని చేస్తే బిజినెస్ వర్గాల్లో ఆసక్తిని క్రియేట్‌చేసిన వాళ్లం అవుతామేమోగానీ, జనాల గుండెల్లో మెమరబుల్ గిఫ్ట్ ని మిస్ అవుతాం. అది నాకు ఇష్టం లేదు`` అని అన్నారు.
గదార్2 సక్సెస్ గురించి కూడా మాట్లాడారు కరీనాకపూర్. ఆమె మాట్లాడుతూ ``సన్నీజీకి ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గదార్ ఫస్ట్ పార్ట్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. సెకండ్ పార్ట్ ఇప్పటిదాకా చూడలేదు. కానీ తప్పకుండా చూడాలని అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు నాకు ఎలాంటి ఆనందం కలిగిందో, సేమ్ ఆనందాన్ని ఈ సినిమా ద్వారా కూడా పొందాలనుకుంటున్నాను గదార్ సీక్వెల్‌కి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు`` అని అన్నారు. కరీనా ప్రస్తుతం కృతిసనన్, టబుతో కలిసి క్రూ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 22న విడుదల కానుంది. సుజయ్ ఘోష్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ లోనూ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కూడా నటిస్తున్నారు.