English | Telugu

సిద్ధి వినాయ‌కుడి గుడిలో మొక్కుతీర్చుకున్న లేడీ డార్లింగ్‌!

సిద్ధి వినాయ‌కుడి గుడిలో మొక్కుతీర్చుకున్న లేడీ డార్లింగ్‌!

బాలీవుడ్ నటి కృతి సనన్ సిద్ధి వినాయకుడి గుడిలో మొక్కు తీర్చుకున్నారు. బాలీవుడ్ నటి కృతి స‌న‌న్ ,   అలియాభట్ ఇటీవల నేషనల్ ఫిల్మ్ అవార్డులో ఉత్తమ నటీమ‌ణి అవార్డును పంచుకున్నారు. 69వ నేషనల్ అవార్డ్స్ ని ఇటీవల ప్రకటించారు.  కృతి సనన్‌ని ఉత్తమ నటిగా మినీ సినిమా కోసం ఎంపిక చేశారు. ఆలియా గంగుబాయి కతియావాడి  సినిమా కోసం ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు వచ్చిన సందర్భంగా కృతి సనన్‌ ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్ ని తన కుటుంబ సమేతంగా సందర్శించారు. అక్కడ ముక్కులు చెల్లించుకున్నారు.

 శనివారం ఉదయం కృతి సనన్‌ సిద్ధి వినాయక టెంపుల్ ని సందర్శించారు. ఆమె డివైన్‌ లుక్ లో కనిపించారని అంటున్నారు బాలీవుడ్ జనాలు. భ‌గ‌వంతుడి  ఆశీస్సులు తీసుకున్నా అని అన్నారు. గుడిలో తీసుకున్న ప్రసాదాన్ని పాపరాజీల‌కు కూడా పంచిపెట్టారు కృతి. తన ఫ్యామిలీతోనూ, అభిమానుల‌తోనూ కలిసి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నారు.  నేషనల్ అవార్డు  గురించి మాట్లాడుతూ `` చాలా ఆనందంగా ఉంది. అద్భుతంగా ఉంది. గర్వంగా భావిస్తున్నాను. చాలా గొప్పగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇది నిజమేనా అనిపిస్తుంది. నన్ను నేను గిల్లు చూసుకుంటున్నాను. నేషనల్ అవార్డు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. మీ కోసం చాలా కష్టపడి పని చేశాను. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. నన్ను అవార్డు కోసం ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. నా పొటెన్షియల్ ని నమ్ముకుని సినిమా ఇండస్ట్రీలో ప్రయాణాన్ని ప్రారంభించాను. ఇంత దూరం వచ్చినందుకు ఆనందంగా ఉంది.

ఈ ప్రయాణంలో నాకు తోడు నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా లక్ష్మణ్ సార్ కి ధన్యవాదాలు చెబుతున్నాను. నేను ఎదుగుతాన‌ని, జీవితంలో ఏదో సాధిస్తాన‌ని మొదటి నుంచి చెప్పింది ఆయనే. ఆయనకి చాలా రుణపడి ఉంటాను`` అని అన్నారు.  అంతేకాకుండా... ``వచ్చింది చూసావా, మనం అచీవ్ చేసాం`` అంటూ... మిమి మీ క్యారెక్టర్ ఉద్దేశించి మాట్లాడారు. ఆ మాట‌లు కూడా వైరల్ అవుతున్నాయి. తన ఫ్యామిలీ మెంబర్స్ కి ధన్యవాదాలు చెప్పారు కృతి . తన తల్లి తండ్రి తన కుటుంబ సభ్యులు ప్రతి చిన్న విషయంలోనూ తనకు తోడుగా నిలబడ్డారని, ప్రతి సందర్భంలోనూ తనకు ధైర్యం చెప్పారు అని, వాళ్ళ ప్రోత్సాహం వల్లే తాను ఇంత దూరం రాగలిగానని చెప్పుకొచ్చారు. ఆలియా అంటే తనకు చాలా ఇష్టమని, ఆలియా పని తీరుని ఎప్పుడు ఆస్వాదిస్తానన్నారు కృతి. తనతో కలిసి అవార్డు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఆమెకు బిగ్ హగ్స్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.