English | Telugu
బాబ్రీ మసీదు కేసులో సన్నీ, సంజయ్ నటిస్తున్నారా?
Updated : Aug 29, 2023
వెటరన్ యాక్టర్ సన్నీడియోల్ బాబ్రీ మసీదు కేసు అనే మూవీకి సంతకం చేశారా? ఆయన నటించిన గదర్2 సూపర్‌డూపర్ సక్సెస్ అయిన ఆనందంలో ఉన్నారు సన్నీడియోల్. ఇదే ఆనందంలో ఆయన బాబ్రీ మసీదు కేసు మూవీకి సంతకం చేశారనే ప్రచారం జరుగుతోంది.
డైరక్టర్ జేపీదత్తా బార్డర్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. 1997లో విడుదలై పెద్ద హిట్ అయింది బార్డర్ సినిమా. అయితే ఇటీవల సన్నీడియోల్ ఓ క్లారిటీ ఇచ్చారు.
``నేను కొత్త సినిమాలకు సంతకాలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే నేనింకా ఏ సినిమాకూ సంతకం చేయలేదు. గదార్2 సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నాను. త్వరలోనే చాలా మంచి ప్రాజెక్టు గురించి ప్రకటిస్తాను. అప్పటివరకు అందరూ ఆనందంగా ఉండండి. గదార్2ని, తారా సింగ్‌ని ప్రేమించండి`` అని పోస్ట్ చేశారు.
బార్డర్2 రూమర్లకు చెక్ పడటం, త్వరలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్టును ప్రకటిస్తానని సన్నీ డియోల్ చెప్పడంతో అందరి దృష్టీ బాబ్రీ మసీద్ కేస్ స్క్రిప్ట్ మీద పడింది. సన్నీడియోల్, సంజయ్ దత్ కలిసి మనోజ్ ముంతసర్ సినిమాకు సైన్ చేశారన్నది నార్త్ లో వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్. 1992లో బాబ్రీ మసీదు డెమాలిషన్ కేస్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాకు సైన్ చేశారన్నది సారాంశం. సన్నీ, వయాకామ్ 18 కలిసి ఈ కోర్టు రూమ్ డ్రామాని ప్రొడ్యూస్ చేస్తాయనే మాట కూడా ప్రచారంలో ఉంది.
బార్డర్ 2 గురించి క్లారిటీ ఇచ్చిన సన్నీ, ఈ సినిమా గురించి నోరు విప్పక పోవడంతో అందరూ నిజమేనని అంటున్నారు. సన్నీ లాయర్‌గా కనిపిస్తారని ఫిక్సయ్యారు. మరోవైపు మా తుఝే సలామ్ ప్రీక్వెల్ సిద్ధం చేస్తున్నారట స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ప్రస్తుతం ఆయన ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు వినికిడి.
