English | Telugu

'జవాన్' ట్రైలర్.. మరో వెయ్యి కోట్ల బొమ్మ!

'జవాన్' ట్రైలర్.. మరో వెయ్యి కోట్ల బొమ్మ!

ఈ ఏడాది 'పఠాన్'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి షారుఖ్ బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మరో వెయ్యి కోట్ల సినిమాని చూసేలా ఉన్నారు షారుఖ్.

షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో అట్లీ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'జవాన్'. రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ నిర్మించిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. జవాన్ ట్రైలర్ యాక్షన్ ప్రియులకు ట్రీట్ లా ఉంది. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ కి, ఎమోషన్స్ కి ఢోకా లేదని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. మొత్తానికి 'జవాన్' ట్రైలర్ చూస్తుంటే 'పఠాన్'ని మించి ఉండబోతుందని అర్థమవుతోంది. కలెక్షన్స్ విషయంలో కూడా అదే జరిగే అవకాశముంది. సౌత్ డైరెక్టర్ తెరకెక్కించిన 'జవాన్'లో పలువురు సౌత్ స్టార్లు నటించారు. 'పఠాన్'తో పోలిస్తే ఈ సినిమా సౌత్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశముంది. ఇక నార్త్ లో, ఓవర్సీస్ లో ఎలాగూ షారుఖ్ సినిమాలకు మంచి వసూళ్లు వస్తాయి కాబట్టి.. 'జవాన్'తో మరోసారి వెయ్యి కోట్ల ఫీట్ సాధించడం పెద్ద లెక్క లేదు. అదే జరిగితే ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు అందించిన హీరోగా రికార్డు క్రియేట్ చేస్తారు.