English | Telugu

ఈ విషయంలో సినిమా పెద్దలు ఒక నిర్ణయం తీసుకోవాలి!

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. సినిమా రంగంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. దీన్ని పాటించకపోవడం వల్ల గతంలో ఎంతో మంది లెజెండ్స్‌ ఆర్థికంగా దెబ్బతిన్నారు. వారి జీవిత చరమాంకంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇది పాతతరానికి చెందిన నటీనటులకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే అలా నష్టపోయినవారు, చివరి దశలో అష్టకష్టాలు పడినవారు, ఆర్థికంగా ఆసరా లేక ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు.

1970కి ముందు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన వారు ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డారు, చివరికి వారి జీవితం ఎలా ముగిసిపోయింది అనే విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చినవారు మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. తమ కంటే ముందు ఉన్నవారు పడిన ఇబ్బందులు తాము పడకుండా చూసుకుంటున్నారు.

అయినప్పటికీ కొందరు కళాకారులు ఆర్థికంగా వెనకబడిపోయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమధ్య నటి పావలా శ్యామల ఆర్థికంగా ఎదుర్కొంటున్న కష్టాల గురించి మీడియాలో వచ్చింది. దాంతో కొందరు నటులు, దర్శకనిర్మాతలు ఆమెకు మద్దతు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను హోంలో చేర్పించారు. ఆ తర్వాత తమ వల్ల కాదంటూ ఆ హోం నిర్వాహకులు శ్యామలను, ఆమె కూతుర్ని బయటికి పంపేశారు. అది గమనించిన పోలీసులు.. ఎసీపీ సాయంతో వృద్ధాశ్రమంలో చేర్పించారు.

ఇదిలా ఉంటే.. మరో నటి పాకీజా పరిస్థితి కూడా దయనీయంగా మారిందని తెలుస్తోంది. ఆమధ్య ఆమె గురించి తెలుసుకున్న చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, నాగబాబు, మోహన్‌బాబు, మంచు విష్ణు వంటి వారు ఆర్థిక సాయం చేశారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్న వార్తలు మీడియాలో వస్తున్నాయి. దీంతో కోనసీమలోని బొబ్బర్లంకలో శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు.. పాకీజాకు ఆశ్రయం కల్పించారు. అయితే ఎంతోకాలంగా నటిస్తూ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న కళాకారులకు ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరూ సూచిస్తున్నారు. ఈ విషయం గురించి సినిమా పెద్దలు ఆలోచన చేయాలని అభిప్రాయపడుతున్నారు.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.