English | Telugu

అఖండ-2 రెండు రోజుల కలెక్షన్స్.. బాలయ్య బాక్సాఫీస్ తాండవం!

అఖండ-2 బాక్సాఫీస్ తాండవం
వంద కోట్లకు చేరువ
బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా పరుగులు

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన మూవీ 'అఖండ 2: తాండవం' (Akhanda 2 Thaandavam). 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్ళతో సత్తా చాటుతోంది. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్స్ తో బాక్సాఫీస్ దగ్గర అఖండ తాండవం మొదలైంది. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు చూపిస్తూ.. రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది.

మొదటి రోజు దాదాపు రూ.60 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ తో.. మొదటి రెండు రోజుల్లోనే 'అఖండ 2' మూవీ వరల్డ్ వైడ్ గా రూ.90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. మూడో రోజు ఆదివారం కావడంతో రూ.35 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా రూ.125 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటనుంది.

2021లో విడుదలైన 'అఖండ' సినిమా ఫుల్ రన్ లో రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఘన విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన 'అఖండ 2'.. కేవలం ఫస్ట్ వీకెండ్ లోనే రూ.125 కోట్లు రాబడుతుండటం విశేషం. ప్రస్తుత జోరు చూస్తుంటే.. సెకండ్ వీకెండ్ కి ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమనిపిస్తోంది.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.