English | Telugu
నాకు పట్టిన గతే వాళ్లకు కూడా పడుతుంది...
Updated : Mar 27, 2024
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 లో మస్త్ గోలగోల చేసిన విషయం తెలిసిందే. మళ్ళొస్తే తగ్గేదేలే...జై జవాన్ అంటూ రకరకాల నినాదాలతో రైతుల తరపున మాట్లాడుతూ ఉండేవాడు. దీంతో కొంత మంది ఆడియన్స్ మాత్రం రైతు టాగ్ వేసుకుని గెలిచాడు అని గేలి చేశారు..కొందరు మాత్రం ఒక రైతు అంత దూరం వెళ్ళాడు అంటూ విష్ చేశారు. బిగ్ బాస్ లాస్ట్ లో జరిగిన హంగామా గురించి కూడా అందరికీ తెలుసు..పల్లవి ప్రశాంత్ ని జైలుకు తీసుకెళ్లారు పోలీసులు. ‘నేను బిగ్ బాస్‌కి వెళ్లాలని అనుకున్నా కానీ.. జైలుకి వెళ్లాలని ఎందుకు అనుకుంటా.
ఇలా ఎవరూ అనుకోరు కదా. పుట్టిన దగ్గర నుంచి నేనెప్పుడూ జైలుకి పోలేదు. ఎవరో చేసిన తప్పుకు నేను జైలుకిపోయాను. నాకు జైలు బువ్వ రాసిపెట్టినట్టు ఉంది. నేను జైలుకి వెళ్ళాక చాలా బాధపడ్డాను. నేనేంటీ.. ఇక్కడికి రావడమేంటి అనుకున్నా. అందరికీ తెలుసు అక్కడ తప్పు నాది కాదు అని. దేవుడు ఉన్నాడు. అన్నీ చూసుకుంటాడు. ఇక భోలే అన్న అయితే నాకోసం చాలా కష్టపడ్డాడు. రైతు బిడ్డ వెనుక పాట బిడ్డ నిలబడ్డాడు. నన్ను బయటకు తీసుకుని రావడం కోసం చాలామంది లాయర్లు వచ్చారు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది. ఇది చాలు కదా. అసలు నాకు ఆ టైంలో తిండి మీద ధ్యాస లేదు. నాకోసం జైలులో తపన పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ల కోసం తిన్నాను. జైలు బువ్వ బాగుంది. నన్ను ఖైదీలంతా బాగా చూసుకున్నారు. ఆరోజు నేను ఇంట్లో ఉన్నా కానీ అంతా నేను పారిపోయానన్నారు.. నేను ఎక్కడికీ పోలేదు.. అక్కడే ఉన్నా..పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఈరోజు నాకు పట్టిన గతే ముందు ముందు నన్ను విమర్శించే వాళ్లకీ పట్టొచ్చు. బిగ్ బాస్ బతుకుదెరువు నేర్పించింది, మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉండాలో నేర్పించింది, ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పింది. జైలు జీవితాన్ని నేర్పించింది. జైలులో చాలా నేర్చుకున్నా. మనిషి ఎప్పుడూ రెండు చోట్లకి అస్సలు పోకూడదు. ఒకటి హాస్పిటల్‌కి రెండు జైలుకి’ అంటూ చెప్పుకొచ్చారు పల్లవి ప్రశాంత్.